Site icon HashtagU Telugu

Chandrababu : రేపు ముంబైకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

Cbn Mukesh

Cbn Mukesh

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu ) రేపు సాయంత్రం ముంబై (Mumbai) వెళ్లనున్నారు. రేపు సాయంత్రం ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఇంట్లో జరిగే శుభ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. శనివారం ముంబైలోనే బస చేసి..ఆదివారం తిరిగి అమరావతికి రానున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుతం దేశం మొత్తం ముఖేష్ అంబానీ ఇంట్లో జరుగుతున్న అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి (Anant Ambani and Radhika Merchant’s wedding ) సంబరాల గురించే మాట్లాడుకుంటున్నారు. మరికాసేపట్లో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ లు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతుంది. ఇందుకోసం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అన్ని మీడియా చానెల్స్ ఈ పెళ్లి తంతు వేడుక దగ్గరే ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ వేడుకకు వివిధ దేశాల నుంచి ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు అతిథులుగా రానున్నారు. ఇప్పటికే పలువురు బడా పారిశ్రామిక వేత్తలు, సహాలీవుడ్ తారలు కిమ్ కర్దాషియన్, ఖ్లో కర్దాషియన్, ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్ దంపతులు ముంబై చేరుకున్నారు. అలాగే బ్రిటన్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్, అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి జాన్ కెర్రీ, స్వీడన్ మాజీ ప్రధాని కార్ల బిడ్త్, కెనడా మాజీ ప్రధాని స్టీపెన్ హార్పర్, టాంజానియా అధ్యక్షురాలు సామి సులుహు హస్సన్ ఇలా చాలా మంది ప్రముఖులు వస్తున్నట్లు సమాచారం. దీంతో అందరి చూపు ఈ వివాహ వేడుక పైనేఉంది.

ఇక ఈ వివాహ ఖర్చు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది. ముకేశ్ కుటుంబంలో జరుగుతునం చివరి వివాహ వేడుక కావడం తో ఖర్చు గురించి ఆలోచన అనేదే చేయడం లేదు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం మొత్తం వివాహ మహోత్సవం ఖర్చు రూ. 4,000-5,000 కోట్ల (0.6 బిలియన్ డాలర్లు) మధ్య ఉంటుందని అంచనా వేస్తుంది. అయితే ఇది అంబానీ కుటుంబ నికర విలువలో కేవలం 0.5 శాతం మాత్రమే కావడం విశేషం. అనంత్ మర్చంట్, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక మొత్తం ఖర్చు దాదాపు రూ. 1,000 కోట్లుగా అంచనా వేయబడింది. రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకకు రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇది కాకుండా మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుక కోసం దాదాపు రూ. 3,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వినికిడి.

Read Also : June 25 as ‘Samvidhaan Hatya Diwas’ : జూన్ 25ను ‘రాజ్యాంగ హత్యాదినం’గా కేంద్రం ప్రకటన

Exit mobile version