Site icon HashtagU Telugu

Chandra Babu : ప్రాంతీయ స‌ద‌స్సులు,3 రాజ‌ధానుల‌కు రివ‌ర్స్

CBN Vision 2024

Chandrababu

ప్రాంతీయ స‌ద‌స్సుల‌కు చంద్ర‌బాబు(Chandra Babu) తెర‌లేపారు. మూడు రోజుల పాటు ఈ స‌ద‌స్సుల‌ను(Regional meetings) నిర్వ‌హించ‌డానికి స‌న్నాహాలు చేశారు. తొలుత ఉత్త‌రాంధ్ర నుంచి ఈ స‌ద‌స్సుల‌ను ప్రారంభిస్తున్నారు. ఈనెల 5వ తేదీన విశాఖ కేంద్రంగా ఉత్త‌రాంధ్ర ప్రాంతీయ స‌ద‌స్సును పెట్టారు. ఆ రోజు ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈ స‌ద‌స్సును నిర్వ‌హిస్తారు. ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు పాల్గొంటారు. మ‌రుస‌టి రోజు 6వ తేదీన ఉభ‌య గోదావ‌రి జిల్లాల రీజిన‌ల్ భేటీ, 12వ తేదీన కృష్ణా రీజియ‌న్ మీటింగ్ ల‌ను పెట్టుకున్నారు. ఈ సద‌స్సుల ద్వారా ప్రాంతీయ విభేదాల‌ను రూపుమాపాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రాంతీయ స‌ద‌స్సుల‌కు చంద్ర‌బాబు(Chandra Babu)

జిల్లాల‌ను జోన్లగా విభజించి ప్రాంతీయ సదస్సులను(Regional meetings) ఏర్పాటు చేస్తున్నారు. కార్యకర్తల్లోనూ జోష్ నింపడానికి చంద్ర‌బాబు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికే కొన్ని జోన్ల సమావేశాలు నిర్వహించ‌డం ద్వారా రాబోయే ఎన్నికల్లో వ్య‌వ‌హ‌రించే అంశంపై దిశానిర్దేశం చేశారు. ఉత్తరాంధ్రలో ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం గెలుపొందడంతో టీడీపీ ఊపు మీద ఉంది. ఇదే ఉత్సాహాన్ని ఎన్నిక‌ల వ‌ర‌కు తీసుకెళ్ల‌డానికి చంద్ర‌బాబు ప్లాన్ చేస్తున్నారు. 5, 6 తేదీల్లో కీల‌క‌ స‌మావేశాల‌ను ప్లాన్ చేశారు. మూడు రాజ‌ధానుల అంశం ముగిసిపోయిన అధ్యాయంగా చెప్ప‌డానికి కూడా స‌ద‌స్సులు ఉప‌యోగంగా ఉన్నాయి. అధికార‌పక్షం క్రియేట్ చేసిన మూడు రాజ‌ధానుల అంశం టీడీపీ ఎమ్మెల్యేల‌ను సైతం ఇబ్బంది పెట్టేలా చేసింది. ఒక‌ప్పుడు గంటా శ్రీనివాస‌రావు మూడు రాజ‌ధానుల‌కు విశాఖ టీడీపీ తీర్మానం చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇలాంటి వాటికి అవ‌కాశం లేకుండా చంద్ర‌బాబు(Chandra Babu) క్యాడ‌ర్ ను ఏక‌తాటిపైకి తీసుకొస్తున్నారు.

చంద్రబాబు(Chandrababu) ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పలు రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 12న నూజివీడులో రోడ్ షో, బహిరంగ సభకు చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నెల 13న గుడివాడలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నెల 13న రాత్రి నిమ్మకూరులో బస చేయనున్నారు. ఈ నెల 14న మచిలీపట్నంలో నిర్వహించే రోడ్ షో, బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతారు. ఈ మేరకు పర్యటన ఖరారైంది.

టీడీపీ వైపు చూసేలా చేయ‌డంలో చంద్ర‌బాబు విజ‌య‌వంతం

ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో నెం1 ప్ర‌కారం స‌భలు, స‌మావేశాల‌ను ముంద‌స్తు అనుమ‌తి లేకుండా పెట్ట‌కూడ‌దు. నిర్దేశిత ప్రాంతాల్లో పోలీసులు సూచించిన మేర‌కు జ‌నం ఉండాలి. ప‌లు కండీష‌న్ల మ‌ధ్య స‌భ‌ల‌ను నిర్వ‌హించే ప‌రిస్థితిని తీసుకొచ్చారు. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు(Chandra Babu) ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆయ‌న కుప్పం వెళ్లి స‌భ‌ల‌ను పెట్టారు. ఆ త‌రువాత ఒక‌టి రెండు చోట్ల స‌భ‌ల‌ను పెట్టిన‌ప్ప‌టికీ క్ర‌మంగా సైలెంట్ అయ్యారు. పార్టీ ఆఫీస్ లోనే ఉంటూ రివ్యూ మీటింగ్ ల‌ను నిర్వ‌హిస్తున్నారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జిలు, పార్ల‌మెంట్ ఇంచార్జిల‌ను నియ‌మిస్తున్నారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ల‌కు ఎమ్మెల్యే స్థానాల‌ను ప్ర‌క‌టించారు. మ‌రికొన్ని చోట్ల ఇంచార్జిల‌ను మారుస్తున్నారు. ఇత‌ర పార్టీల వాళ్లు కూడా టీడీపీ వైపు చూసేలా చేయ‌డంలో చంద్ర‌బాబు విజ‌య‌వంతం అయ్యారు.

రీజిన‌ల్ స‌ద‌స్సుల ద్వారా .(Regional)

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌రువాత అభ్య‌ర్థిత్వాల కోసం పోటీ పెరిగింది. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ ప‌డుతున్నారు. ఇలాంటి చోట ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌రిగే రీజిన‌ల్ స‌ద‌స్సుల(Regional) ద్వారా క్యాడ‌ర్, లీడ‌ర్ల‌ను సమ‌న్వ‌యం చేయ‌డానికి చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. రాయ‌ల‌సీమ‌, కోస్తా, ఉత్త‌రాంధ్ర జిల్లాల‌ను ఏకం చేయ‌డంతో పాటు అమ‌రావ‌తి రాజ‌ధాని నినాదాన్ని వినిపించ‌డానికి స‌న్న‌ద్ధం చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చెప్పిన విధంగా ఐటీ హ‌బ్ గా విశాఖ‌, ఆర్థిక హ‌బ్ గా విజ‌య‌వాడ‌, హార్డ్ వేర్ హ‌బ్ గా రాయ‌లసీమ‌, ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుప‌తి..ఇలా స‌మ‌గ్ర అభివృద్ధిని ప్రాంతీయ స‌ద‌స్సుల్లో వినిపించ‌బోతున్నారు.

Also Read : Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047, ఆవిర్భావ సభలో తెలుగుజాతికి దిశానిర్దేశం

వ‌చ్చే ఎన్నిక‌ల దిశ‌గా క్యాడ‌ర్ కు దిశానిర్దేశం (Chandra Babu)ఇవ్వ‌నున్నారు. అంతేకాదు, ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యే రీతిలో స‌మ‌గ్ర అభివృద్ధి న‌మూనాను ప్ర‌జాక్షేత్రంలో వినిపించ‌బోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని చెబుతూ మ‌రో వైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొర‌బాటును జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సీఎం చేస్తే వ‌చ్చే న‌ష్టాన్ని విడ‌మ‌ర‌చి చెప్పాల‌ని పిలుపు ఇవ్వ‌బోతున్నారు. సంక్షేమం ప్ల‌స్ అభివృద్ధి ప్ల‌స్ అస‌మాన‌త‌ల తొల‌గింపు దిశ‌గా ప్ర‌చారం ఉండేలా ప్లాన్ చేశారు

Also Read : Chandrababu: ఈ చిన్న లాజిక్ గమనిస్తే చంద్రబాబే సీఎం