టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu C) కు ఏపీ హైకోర్టు (AP High Court) భారీ షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ఏ24గా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ1గా, అంగళ్లు కేసులో ఏ1గా ఉన్నారు.
అంగళ్లు కేసులో ఇప్పటికే పలువురికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో… చంద్రబాబుకు ఈ కేసులో కచ్చితంగా బెయిల్ వస్తుందని టీడీపీ శ్రేణులు భావించాయి. అయితే, హైకోర్టు బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. బెయిల్ పిటిషన్లను కొట్టేయడంతో సుప్రీంకోర్టును టీడీపీ ఆశ్రయించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటె సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు మీద ఉన్న కేసును కొట్టేయాలంటూ ఆయన తరుఫు లాయర్లు క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
దీని మీద ఈరోజు సుప్రీం కోర్ట్ తీర్పును ఇవ్వనుంది. ఈ కేసు సుప్రీంకోర్టులో 59వ ఐటెమ్ గా లిస్ట్ అయింది. జస్టిస్ అనిపుధ్ బోస్, జస్టిస్ బేలా. ఎమ్.త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారణ చేయనుంది. చంద్రబాబు తరుపున సీనియర్ లాయర్లు హరీష్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వి,సిద్ధార్ధ లూథ్రా వాదనలు వినిపించనున్నారు. ఏపీ ప్రభుత్వం తరుపున ముకుల్ రోహ్గతి వాదనలు వినిపిస్తారు. మరి ఈ కేసులో చంద్రబాబు కు ఊరట లభిస్తుందో లేదో చూడాలి.
Read Also : Govt Employees – New Scheme : ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక హెల్త్ కేర్ ట్రస్టు.. వివరాలివీ..