Polavaram Project : పోలవరం కట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే..కేంద్రం భారీ షాక్

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 11:53 AM IST

పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) విషయంలో కేంద్రం భారీ షాక్ ఇచ్చింది..పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే అని మొదట్లో చెప్పిన కేంద్రం..ఆ తర్వాత పలు కొరతలు విధిస్తు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు సగం కూడా పూర్తి కాలేదు. ప్రభుత్వాలు మారుతున్న ప్రజలు కోరిక మాత్రం నెరవేరడం లేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందో లేదో అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం ఫై అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి తెస్తూనే ఉన్నాయి. తాజాగా పార్లమెంట్ సభల్లో దీనిపై టీడీపీ , వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి షాక్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

పోలవరం జాతీయ ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిదే అయినా దాన్ని ప్రత్యక్షంగా నిర్మించాల్సింది మాత్రం ఏపీ ప్రభుత్వమే అని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్రానికి చెందిన టీడీపీ, బీజేపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, సీఎం రమేష్ పోలవరం ప్రాజెక్టును విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినా 2020 నుంచి పనులు ఎందుకు జరగడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. 2020 నుంచి ఈ ప్రాజెక్టు ముందుకు కదల్లేదన్న ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి.. 2020-21లో రూ.2234 కోట్లు, 2021-22లో రూ.711 కోట్లు, 2022-23లో రూ.1671 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తమ సొంత నిధులతో ఖర్చుచేసి కేంద్రానికి బిల్లులు సమర్పిస్తే రీయింబర్స్ మెంట్ చేస్తామని జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తేల్చిచెప్పేశారు. రాష్ట్రం వద్ద నిధులు లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లడం లేదని ఆయన క్లారిటీ ఇచ్చినట్లయింది.

Read Also : Balka suman : సుమన్ ఫై కాదు.. రేవంత్ ఫై కేసు పెట్టాలి: కవిత