Chandrababu : మెగా డీఎస్సీపై ఏపీ వ్యాప్తంగా సంబరాలు

ఐదేళ్లుగా టీచర్‌ కొలువు కోసం తాము కంటున్న కలలను నిజం చేశారని నిరుద్యోగులు సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ.. థాంక్యూ సీఎం సార్‌ అంటూ పలుచోట్ల ఆయన చిత్రపటానికి పాలభిషేకం చేశారు

Published By: HashtagU Telugu Desk
Megadsc Happy

Megadsc Happy

ఏపీలో కొత్త ప్రభుత్వం (AP New Government ) కొలువు దీరేందో లేదో అప్పుడే ఎన్నికల్లో ప్రకటించిన హామీలు నెరవేర్చే పనిలో పడింది. బుధువారం ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు (CBN)..గురువారం రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రిగాబాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే సీఎం హోదాలో మెుదట మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సెన్సెస్‌, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేశారు. ఇక మెగా డీఎస్సీలో భాగంగా ప్రకటించిన 16,347 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. డిసెంబర్ 31 నాటికల్లా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ను సీఎస్ ఆదేశించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ హామీల అమలు ఫై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లుగా టీచర్‌ కొలువు కోసం తాము కంటున్న కలలను నిజం చేశారని నిరుద్యోగులు సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ.. థాంక్యూ సీఎం సార్‌ అంటూ పలుచోట్ల ఆయన చిత్రపటానికి పాలభిషేకం చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాటపై నిలబడ్డారంటూ కొనియాడారు. 117 జీవో రద్దు చేసి ఎస్జీటీ పోస్టులు పెంచితే తమకు మరింత మేలు చేసిన వారవుతారని నిరుద్యోగులు కోరుతున్నారు.

Read Also : Free Bus Scheme : బడి పిల్లల ఆనందం చూసి ముచ్చటపడ్డ సీఎం రేవంత్ రెడ్డి

  Last Updated: 14 Jun 2024, 01:15 PM IST