CEC Find Fake Votes : అమ్మ జ‌గ‌నా!APలో 27ల‌క్ష‌ల పైగా దొంగ ఓట‌ర్లు!

CEC Find Fake Votes : సంద‌డ్లో స‌డేమియా అంటే ఇదేనేమో!తెలుగు స‌మాజం మొత్తం చంద్ర‌బాబు జైలుకు వెళ్ల‌డాన్న చూస్తోంది.

  • Written By:
  • Publish Date - September 13, 2023 / 03:54 PM IST

CEC Find Fake Votes : సంద‌డ్లో స‌డేమియా అంటే ఇదేనేమో!తెలుగు స‌మాజం మొత్తం చంద్ర‌బాబు జైలుకు వెళ్ల‌డాన్న చూస్తోంది. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్ 27 ల‌క్ష‌ల పై చిలుకు దొంగ ఓట్ల‌ను చేర్పించింది. ఒక దెబ్బ‌కు రెండు పిట్ట‌ల్లా ఆయ‌న లండ‌న్ వెళ్లిన ర‌హ‌స్యాలు, దొంగ ఓట్ల వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు రాకుండా చంద్ర‌బాబును `స్కిల్` ఉప‌యోగించి ఇరికించేశారు. అంద‌రూ అటు వైపు చూస్తుండ‌గా ఇటు వైపు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న వ్యూహాన్ని ముగించారు. అయితే, ఎన్నిక‌ల క‌మిష‌న్ క‌ళ్లు తెరిచింది. ఏపీలో 27,13,443 దొంగ ఓట్లు చేర్చార‌ని తేల్చేసేంది.

ఏపీలో 27,13,443 దొంగ ఓట్లు(CEC Find Fake Votes)

ఎప్పుడూ లేనివిధంగా జీరో నెంబ‌ర్ డోర్ నెంబ‌ర్ తో 2ల‌క్ష‌లా 51వేలా, 767 ఓట్లు న‌మోదు కావ‌డం దేశ చ‌రిత్ర‌లో ఇదో రికార్ట్. ఒకే డోర్ నెంబ‌ర్ తో 10 ఓట్ల‌కు పైగా న‌మోద అయిన ఇళ్లు 1ల‌క్షా 57వేలా 939 ఉండ‌డం కూడా మ‌రో వండ‌ర్. ఒకే డోర్ నెంబ‌ర్ తో ఉన్న ఓట్లు 24లక్ష‌లా 61వేలా 676 న‌మోదు చేయ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌యాంలోనే సాధ్య‌మైంది. ఇలా, ఏపీలో జ‌రుగుతోన్న దొంగ‌ప‌నుల గురించి కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి (CEC Find Fake Votes)  ఎంపీ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఆయ‌న ఈసీ లేఖ రాయ‌డంతో అప్ర‌మ‌త్తం అయింది. ప్ర‌తిగా త్రిబుల్ ఆర్ కు సమాధానం ఇస్తూ రాష్ట్రంలో 27ల‌క్ష‌ల‌కు పైగా దొంగ ఓట్లు ఉన్న‌ట్టు గుర్తించామ‌ని వివ‌రించారు.

జీరో నెంబ‌ర్ డోర్ నెంబ‌ర్ తో 2ల‌క్ష‌లా 51వేలా, 767 ఓట్లు

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 25వేల ఓట్లను ల‌క్ష్యంగా పెట్టుకోవాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైసీపీ క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేశార‌ట‌. ఆ మేర‌కు గృహ సార‌థులు, వలంటీర్లు యుద్ధ ప్రాతిప‌దిక‌న ఓట్ల‌ను చేర్చారు. దొంగ ఓట్ల‌ను టీడీపీ చేర్పించింద‌ని వైసీపీ ఆరోపిస్తోంది. అధికారంలో ఉన్న వాళ్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ఇలాంటి దొంగ‌ప‌నులు చేశార‌ని టీడీపీ ఆధారాల‌తో చెబుతోంది. తొలుత టీడీపీ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్ త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఓట్ల తొల‌గింపును గుర్తించారు. ఆ త‌రువాత మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు తెలుసుకున్నారు. విశాఖ‌లోని మ‌రో మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు ఆ జిల్లాలో జ‌రిగిన దొంగ ఓట్ల భాగోతాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ యుద్ధ ప్రాతిప‌దిక‌న దొంగ ఓట్ల చేరిక‌ల‌పై దృష్టి పెట్టింది. సీన్ క‌ట్ చేస్తే, 27 లక్ష‌ల దొంగ ఓట్ల‌ను (CEC Find Fake Votes)  వైసీపీ చేర్చిన‌ట్టు బ‌య‌ట‌ప‌డింద‌ని టీడీపీ చెబుతోంది.

Also Read : Chandrababu Remand: చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి జైలుకు జనసేనాని

రాష్ట్రంలో జీరో హౌస్ నెంబర్ తో 2,51,767 ఓట్లు నమోదు. ఒకే డోర్ నెంబర్ తో 10 ఓట్లకు పైగా ఉన్న ఇళ్లు 1,57,939. ఒకే డోర్ నెంబర్ తో ఉన్న ఓట్లు 24,61,676 ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని,అధికారులపై అజమాయిషీ చేస్తూ, సాంకేతికంగా ఎక్కడా దొరక్కుండా, వాలంటీర్ల సహాయంతో పేర్లలో చిన్న చిన్న మార్పులు చేస్తూ అతి పెద్ద మోసానికి తెర‌పిన‌ట్టు ఈసీ గుర్తించింది. రాష్ట్రంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి సృష్టించి ప్రజలందరు ఆ గొడవలో ఉంటే, మీరు మాత్రం దొంగ ఓట్లు సృష్టించడంలో వైసీపీ ఉంద‌ని టీడీపీ మాజీ మంత్రులు ఆరోపించారు. ‘నియోజకవర్గాల వారీగా దొంగ ఓటర్ల లెక్కలు బయటపడాలి. దొంగ ఓటర్లతో పాటు వాటిని ప్రోత్సహించిన వారికి, సహకరించిన వారికి కూడా శిక్షలు పడాలి. అప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఇక ఈ రాష్ట్రంలో వైకాపా కు చెల్లుచీటి పడిపోయింది. ఈరోజు నుంచి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది’ అని గంటా ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Also Read : Jagan Delhi Strategy : చంద్ర‌బాబుకు క‌మాండో భ‌ద్ర‌త‌ తొల‌గింపు?

టీడీపీ సానుభూతి ప‌రులు, క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను పెద్ద సంఖ్య‌లో తొల‌గించారు. అలాగే, వైసీపీ సానుభూతిప‌రులు, రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఓటర్ల‌ను పెద్ద ఎత్తున జాబితాలో చేర్చారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి క‌నీసం 25వేల‌కు త‌గ్గ‌కుండా చేర్చాల‌ని ఇంట‌ర్న‌ల్ మీటింగ్ లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టార్గెట్ పెట్టార‌ట‌. ఆ మేరకు యుద్ధ ప్ర‌తిప‌దిక‌న వాలంటీర్లు, గృహ సార‌థులు ముందుకు క‌దిలారు. లక్ష్యాన్ని చేరుకున్నారు. కానీ, ఈసీ బ‌హిర్గ‌తం చేసింది. వ్యూహాత్మ‌కంగా లండ‌న్ ప‌ర్య‌ట‌న వివ‌రాలు బ‌య‌ట‌కు రాకుండా చంద్ర‌బాబు అరెస్ట్ వైపు ప్ర‌జల దృష్టి మ‌ర‌ల్చారు. దొంగ ఓట్ల గురించి ప్ర‌స్తావ‌న లేకుండా చేయ‌గ‌లిగారు. అదే మ‌రి, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజ‌కీయ చ‌తుర‌త‌!