Site icon HashtagU Telugu

AP Elections : వైసీపీకి షాకిచ్చిన ఈసీ.. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌పై క్లారిటీ

Ysrcp Ec

Ysrcp Ec

AP Elections : వైఎస్సార్ సీపీకి మరో షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపుపై వైఎస్సార్ సీపీ లేవనెత్తిన అభ్యంతరాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.  డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి.. సీల్, హోదా లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందని ఈసీ తేల్చి చెప్పింది.  దీంతో వైఎస్సార్ సీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఎన్నికల కౌంటింగ్ టైంలో రిటర్నింగ్ అధికారి ఇటువంటి పోస్టల్ బ్యాలెట్లను వ్యాలిడ్ చేయాలని పేర్కొంటూ క్లియర్ కట్‌గా  ఈసీ ఆదేశాలను జారీచేసింది. ఈ మేరకు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాశారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ అంశంలో సీఈఓ ఇచ్చిన మెమోపై హైకోర్టులో ఇవాళే వైఎస్సార్ సీపీ లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీఐ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఏపీ సీఈఓ(AP Elections) కొత్త రూల్స్ ఇచ్చారని.. తద్వారా పోలింగ్ బూత్‌ల ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పిటిషన్‌లో వైఎస్సార్ సీపీ ఆరోపించింది. దీన్ని అత్యవసరంగా ఇవాళే విచారించేందుకు కోర్టు సిద్ధమైంది. ఈలోపే ఏపీ సీఈఓ ఇచ్చిన మెమో సరైనదేనని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం లేఖలో స్పష్టం చేసింది. దీంతో వైఎస్సార్ సీపీ ఖంగుతింది. ఇక హైకోర్టులో వైఎస్సార్ సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎలాంటి  తీర్పు వస్తుందో వేచిచూడాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇందుకు మరో నాలుగు రోజుల టైమే ఉంది. ఈ కీలక తరుణంలో అధికార వైఎస్సార్ సీపీకి  కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది.

Also Read : Manmohan Singh : ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ తగ్గించారు.. మన్మోహన్‌సింగ్ కీలక వ్యాఖ్యలు

పోస్టల్ బ్యాలెట్ విషయంపై న్యాయస్థానంలో విచారణ సైతం ప్రారంభం అయింది. 13ఏ, 13బీకి సంబంధించిన అన్ని నిబంధనలను ముందుగానే ప్రకటించారని పిటిషనర్ (వైఎస్సార్ సీపీ) అడ్వకేట్ వాదనలు వినిపించారు. పోస్టల్ బ్యాలెట్ లో స్క్రూటినీ చాలా ముఖ్యమని.. ఈసీఐ నిబంధనల ప్రకారం గెజిటెడ్ అధికారి సంతకం లేకపోతే దాన్ని రద్దు చెయ్యాలని కోరారు.  ఆర్ఓ సీలు,  సంతకంతోనే ఓట్ వాలిడ్ అవుతుందని పేర్కొన్నారు. ఈ నిబంధనలు ఈసీ ముందుగానే చెప్పిందని.. పిటిషనర్ అడ్వకేట్ వాదనలు వినిపించారు.

Exit mobile version