CBN Victory : చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తుగా విప‌క్షాలు, విజ‌య‌వాడ‌కు ప‌వ‌న్ !

CBN Victory :చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తుగా లెఫ్ట్ అండ్ రైట్ పార్టీలు నిలిచాయి. ఆయా పార్టీల అధిప‌తులు ఆయ‌న నిజాయితీని కొనియాడుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 9, 2023 / 03:57 PM IST

CBN Victory : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తుగా లెఫ్ట్ అండ్ రైట్ పార్టీలు నిలిచాయి. ఆయా పార్టీల అధిప‌తులు సానుభూతిని తెలియ‌చేస్తూ ఆయ‌న నిజాయితీని కొనియాడుతున్నారు. అర్థ‌రాత్రి నుంచి హంగామా సృష్టించి అరెస్ట్ చేసిన తీరును త‌ప్పు బ‌డుతున్నారు. ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురంధ‌రేశ్వ‌రి ఆయ‌న‌కు అండ‌గా నిలిచారు. అరెస్ట్ ను ఖండించారు. ఉభ‌య క‌మ్యూనిస్ట్ పార్టీల ఏపీ లీడ‌ర్లు రామ‌కృష్ణ‌, మ‌ధు త‌ప్పుబ‌ట్టారు. ఇక జ‌న‌సేన చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఏపీ సీఐడీ తీరుపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. ఆరోప‌ణ‌ల నుంచి చంద్ర‌బాబు బ‌య‌ట‌కు వ‌స్తార‌ని ఆకాంక్షించారు.

చంద్ర‌బాబు ఎప్పుడూ టెక్నిక‌ల్ గా  త‌ప్పు చేయ‌రు(CBN Victory)

వాస్త‌వంగా చంద్ర‌బాబు ఎప్పుడూ టెక్నిక‌ల్ గా (CBN Victory) త‌ప్పు చేయ‌రు. ఆ విష‌యాన్ని అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌క‌టించారు. నిప్పులా రాజ‌కీయాలు చేసిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేస్తుంటారు. అసెంబ్లీలోనూ టెక్నిక‌ల్ గా త‌ప్పుంటే ఏ శిక్ష కైనా సిద్ద‌మంటూ గ‌తంలోనే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స‌వాల్ విసిరారు. అమ‌రావ‌తి రాజ‌ధాని విష‌యంలో ప‌లు ఆరోప‌ణ‌ల‌ను చంద్ర‌బాబు మీద జ‌గ‌న్ స‌ర్కార్ మోపింది. ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్, ఇన్న‌ర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్, అసైన్డ్ ల్యాండ్స్ , సింగ‌పూర్ కన్సార్టియం ఒప్పందంలోనూ అక్ర‌మాలు జ‌రిగాయ‌ని గ‌త మూడేళ్లుగా ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఇదే ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌తిప‌క్షంలోఉండ‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేశారు. వాటిని నిరూపించ‌డానికి మూడున్న‌రేళ్లుగా జ‌గ‌న్ స‌ర్కార్ త‌పస్సు చేస్తోంది. కానీ, ఎక్క‌డా టెక్నిక‌ల్ గా చంద్ర‌బాబు దొర‌క‌లేదు.

ప్ర‌పంచంలో ఏపీకి ప్ర‌త్యేక గుర్తింపు తీసుకురావాల‌ని

స్కిల్ డ‌వెల‌ప్మెంట్ విష‌యంలోనూ అసెంబ్లీ వేదిక‌గా ప‌లుమార్లు చ‌ర్చ జ‌రిగింది. అందుకోసం ఏర్పాటు చేసిన కార్పొరేష‌న్ కు గంటా సుబ్బారావు ఎండీగా ఉన్నారు. ఉమ్మ‌డి ఏపీలోనూ ఆయ‌న ఐటీ రంగాన్ని ప్రోత్స‌హించ‌డానికి స్కిల్ డ‌వెల‌ప్మెంట్ ప్రోగ్రామ్స్ ను విజ‌య‌వంతంగా నడిపించారు. ఇంజనీరింగ్ కాలేజిల్లో విద్యార్థుల‌కు స్కిల్స్ నేర్పించ‌డానికి జ‌వ‌హ‌ర్ నాలెడ్జి సెంట‌ర్ల‌ను న‌డిపేందుకు ఆయ‌న ప‌డిన త‌ప‌న అంద‌రికీ తెలిసిందే. ఉమ్మ‌డి ఏపీ విడిపోయిన త‌రువాత కూడా అదే త‌ర‌హాలో విద్యార్థుల‌కు స్కిల్స్ నేర్ప‌డం ద్వారా ప్ర‌పంచంలో ఏపీకి ప్ర‌త్యేక గుర్తింపు తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నం (CBN Victory) చేశారు. ఆ క్ర‌మంలో సీమ‌న్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. స‌రిగ్గా ఇక్క‌డే అక్ర‌మాలు జ‌రిగాయ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ అనుమానిస్తోంది.

Also Read : CBN Praja Vedika : చంద్ర‌బాబు సంస్క‌ర‌ణ‌లు-మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం

వాస్త‌వంగా 2014లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సిమెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల క్లస్టర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసింది. సాంకేతిక భాగస్వాములైన సిమెన్స్ మరియు డిజైన్ టెక్ 90% గ్రాంట్-ఇన్-ఎయిడ్‌గా ప్రభుత్వం 10% ఇచ్చేలా ప్రాజెక్ట్ వ్యయాన్ని ₹ 3,300 కోట్లుగా త‌యారు చేసింది. ఆ మేర‌కు అవగాహన ఒప్పందం (MOU) రూపొందించబడింది. కానీ, సిమెన్స్ మరియు డిజైన్ టెక్ అందించిన 90% సహకారం గురించి ప్రస్తావించబడలేదు. ఈ ఎంఓయూను చంద్రబాబు నాయుడు ఆమోదించార‌ని సీఐడీ చెబుతోంది. ఆ కుట్రలో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు హస్తం ఉందని సీఐడీ ఆరోపిస్తోంది.

“ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹ 371 కోట్లను విడుదల చేసింది. కానీ, కేవలం ఒక చిన్న భాగాన్ని మాత్రమే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను స్థాపించడానికి ఉపయోగించబడింది” అని సిఐడి చీఫ్ ఎన్. సంజయ్ చెబుతున్నారు. డబ్బును షెల్ కంపెనీలు నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా మళ్లించారని ఆరోపించారు. ఇన్‌వాయిస్‌లలో పేర్కొన్న విధంగా లావాదేవీలు లేవ‌ని సీఐడీ గుర్తించింది. కానీ, ఎక్క‌డా చంద్ర‌బాబు సంత‌కం మాత్రం లేదు. కేవ‌లం మౌఖికంగా ఆయ‌న డైరెక్ష‌న్లోనే అంతా జ‌రిగింద‌ని సీఐడీ అభియోగం.

అనుమానితునిగా చంద్ర‌బాబునాయుడు అరెస్ట్ 

అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీవీ రమేష్, స్పెషల్ సెక్రటరీ (ఆర్థిక శాఖ) కె.సునీత సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు కార్పొరేషన్‌కు సంబంధించిన ఫైళ్లలో నోట్స్ చేసినట్లు సీఐడీ అధికారులు చెబుతున్నారు. డిజైన్ టెక్‌కు ముందస్తుగా నిధులు విడుదల చేయడాన్ని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మౌఖిక ఆదేశాల మేరకు ఇలా జరిగిన‌ట్టు సీఐడీ గుర్తించింది.
అప్పటి డిజైన్ టెక్ మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ వినాయక్ ఖాన్విల్కర్ నుంచి స్వాధీనం చేసుకున్న నగదు నిల్వలతో సహా దుర్వినియోగమైన నిధుల గురించి సీఐడీ తెలుసుకుంది. తుది లబ్ధిదారులను కనుగొనడానికి దర్యాప్తు చేస్తోంది. కీలకమైన పత్రాలు కనిపించకుండా పోయాయని, అనుమానితునిగా చంద్ర‌బాబునాయుడును అరెస్ట్ చేయాల్సి వచ్చిందని డిపార్ట్‌మెంట్ తెలిపింది.

Also Read : CBN Daring : బాంబుల‌కే భ‌య‌ప‌డ‌ని చంద్ర‌బాబు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మరియు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ వింగ్ కూడా ఈ కేసును దర్యాప్తు చేశాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు పంచుకున్న నోట్‌లో పేర్కొంది. Simens Industrial Software India Private Limited ఒక అంతర్గత విచారణను నిర్వహించింది. అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ బోస్ అనుమతి లేకుండా ప్రవర్తించాడని పేర్కొంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా డిజైన్ టెక్‌కు చెల్లించిన ₹ 371 కోట్లలో సిమెన్స్ కేవలం ₹ 58.8 కోట్లు మాత్రమే పొందిందని తేలింది. సౌమ్యాద్రి శేఖర్ బోస్, అప్పటి సిమెన్స్ ఎండీ సుమన్ బోస్ మరియుడిజైన్ టెక్ ఎండీ ఖాన్విల్కర్ ₹ 241 కోట్లను స్వాహా చేశారు. హైదరాబాద్, పూణేలకు సొమ్మును పంపించేందుకు హవాలా ఉపయోగించుకున్నారని ఆరోపించారు.

జ‌న‌సేనాని ప‌వ‌న్ విజ‌య‌వాడ‌కు చేరుకుని చంద్ర‌బాబును (CBN Victory)

స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బోస్, ఖాన్విల్కర్, స్కిల్లర్ ఎంటర్‌ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు మాజీ ఆర్థిక సలహాదారు మరియు సంతకం చేసిన ముకుల్ చంద్ర అగర్వాల్ మరియు చార్టర్డ్ అకౌంటెంట్ సురేష్ గోయల్‌లను ఈ ఏడాది ప్రారంభంలో ED అరెస్టు చేసింది. డిజైన్ టెక్‌కి చెందిన ₹ 31.2 కోట్ల విలువైన ఆస్తులను కూడా ఏజెన్సీ తాత్కాలికంగా అటాచ్ చేసింది. అటు ఈడీ ఇటు ఏపీ సీఐడీ విచార‌ణ చేస్తోన్న ఈ కేసులో ఎక్క‌డా చంద్ర‌బాబు టెక్కిక‌ల్ గా లేరు. కానీ, అనుమానితునిగా ఆయ‌న్ను అరెస్ట్ చేసి విచారించ‌డానికి ఏపీ సీఐడీ సాహ‌సం చేసింది. ఆ ప్ర‌క్రియ‌ను క‌క్ష సాధింపు చ‌ర్య త‌ర‌హాలో చేయడాన్ని వైసీపీ మిన‌హా అన్ని రాజ‌కీయ పార్టీలు ఖండిస్తున్నాయి. ప్ర‌త్యేకించి కేంద్రంలోని బీజేపీ ఏపీ విభాగం నేత‌లు అండ‌గా నిలుస్తూ  (CBN Victory)చంద్ర‌బాబుకు మాన‌సిక ధైర్యాన్ని ఇస్తున్నారు.

జ‌న‌సేనాని ప‌వ‌న్ విజ‌య‌వాడ‌కు చేరుకుని చంద్ర‌బాబును ప‌రామ‌ర్శించనున్నారు. ఆయ‌న మీద గ‌తంలో విశాఖ వేదిక‌గా ఏపీ పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరును గుర్తు చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సైకో వాల‌కాన్ని ఆయ‌న త‌ప్పుబ‌డుతున్నారు. 40ఏళ్ల‌కు పైగా రాష్ట్రానికి సేవ చేసిన చంద్ర‌బాబును అర్థ‌రాత్రి పోలీసులు అరెస్ట్ చేయ‌డాన్ని ప‌వ‌న్ త‌ప్పుబ‌డుతున్నారు. ఆయ‌న‌కు అండ‌గా నిల‌వాల‌ని క్యాడ‌ర్ కు పిలుపునిచ్చారు. ఏపీలో సైకో పాల‌న పోవాల‌ని నిన‌దించారు. ఏపీ సీఐడీ చంద్ర‌బాబును విజ‌య‌వాడ‌కు తీసుకురానున్నారు. అక్క‌డే ప‌వ‌న్ ఆయ‌న్ను క‌ల‌వ‌డానికి సిద్ద‌ప‌డ్డారు.

 Also Read : Indraprastham : మళ్లీ తెరమీదకు YSR -CBN వెబ్ సిరీస్