Site icon HashtagU Telugu

CBN : చంద్ర‌బాబుపై రాళ్ల దాడి వెనుక పొలిటిక‌ల్ కుట్ర‌?

Cbn

Cbn

ప్ర‌కాశం జిల్లా ఎర్ర‌గొండ‌పాలెం కేంద్రంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై(CBN) జ‌రిగిన‌ రాళ్ల దాడి(Stone pelting) వెనుక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహాత్మ‌క రాజ‌కీయం లేక‌పోలేదు. సామాజిక‌వ‌ర్గాల ప‌రంగా ఆయ‌న వేస్తోన్న ల‌ఓటు బ్యాంకు లెక్కలు చాలా ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే మూడు రాజ‌ధానులు అంటూ ప్రాంతాల‌ను విడ‌దీసే ప్ర‌య‌త్నం జ‌రిగింది. దానికి తోడు ఇప్పుడు సామాజిక‌వ‌ర్గాల మూలాల్లోకి వెళుతున్నారు. రాబోవు ఎన్నిక‌ల్లో ప్రాంత‌, సామాజిక ఈక్వేష‌న్ల‌తో `మ‌రో ఛాన్స్ ` పొందాల‌ను మాస్ట‌ర్ స్కెచ్ వేసిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లోని వినికిడి.

రాళ్ల దాడి వెనుక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహాత్మ‌క రాజ‌కీయం (CBN)

ఇటీవ‌ల చంద్ర‌బాబునాయుడు(CBN) ఎక్క‌డికి  వెళ్లినా జ‌నం విప‌రీతంగా వ‌స్తున్నారు. ఆయ‌న కోసం బారులు తీరుతున్నారు. రాష్ట్రానికి ఆయ‌న త‌ప్ప మ‌రో మార్గంలేద‌ని భావిస్తూ తండోప‌తండాలు జ‌నం ఎగ‌బడుతున్నారు. ఆ విష‌యాన్ని స‌హ‌జంగా నిఘా వ‌ర్గాలు ప్ర‌భుత్వానికి చేర‌వేస్తాయి. ప్రతిగా జ‌గన్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్ రాజ‌కీయ వ్యూహాల‌ను మార్చుకోవ‌డం స‌హ‌జం. అందులో భాగంగా `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` ప్రోగ్రామ్ ను అడ్డుకునే ప్ర‌య‌త్నం ఇటీవ‌ల మొద‌లైయింది. ఆ క్ర‌మంలో జీవో నెం 1 తీసుకొచ్చారు. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు వెనుక‌డుగు వేయ‌లేదు. ప్ర‌జా ఉద్య‌మం దిశ‌గా జ‌నాన్ని న‌డిపించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

మ‌త ప్రాతిప‌దిక‌న ఓటు బ్యాంక్ ను ప‌దిల‌ప‌రుచుకోవ‌డానికి

చంద్ర‌బాబు కు(CBN) వ‌స్తోన్న ప్ర‌జాద‌ర‌ణ కు విరుగుడుగా సామాజిక‌వ‌ర్గాల ఈక్వేష‌న్ దిశ‌గా జ‌గ‌న్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నార‌ని వైసీపీలోని టాక్‌. ఏపీలోని సామాజిక‌వ‌ర్గాల ఈక్వేష‌న్ తీసుకుంటే, క్రిస్టియ‌న్లు ఎక్కువ‌గా ఉన్నారు. ఎస్సీలు ఎక్కువ‌గా క్రిస్టియ‌న్లుగా మారిన రాష్ట్రం ఏపీ ఉంది. మ‌త ప్రాతిప‌దిక‌న ఓటు బ్యాంక్ ను ప‌దిల‌ప‌రుచుకోవ‌డానికి పంచాయ‌తీరాజ్ శాఖ నుంచి చ‌ర్చిల నిర్మాణం కోసం ఇటీవ‌ల సుమారు 1000 కోట్లు విడుద‌ల చేస్తూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ జీవో విడుద‌లు చేసింది. అంతేకాదు, ఫాస్ట‌ర్ల‌కు ప్ర‌స్తుతం నెల‌కు ఇస్తోన్న గౌర‌వ‌వేత‌నం రూ. 5వేల‌ను రూ. 10వేలుగా మార్చడానికి ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

మాల‌, మాదిగ వ‌ర్గాల‌ను వేర్వేరుగా(CBN)

ఇక ఎస్సీల్లోని మాల‌, మాదిగ వ‌ర్గాల‌ను వేర్వేరుగా చూస్తారు. స‌హ‌జంగా మాదిగ‌లు టీడీపీ వైపు ఎక్కువ‌గా ఉంటారు. ఇటీవ‌ల మాల సామాజిక‌వ‌ర్గం కూడా టీడీపీ వైపు మ‌ళ్లింది. సామాజిక‌వ‌ర్గాలు, ప్రాంతాల‌కు అతీతంగా చంద్ర‌బాబు(CBN) స‌భ‌ల‌కు జ‌నం హాజ‌ర‌వుతున్నారు. అందుకే, ఇప్పుడు మాల సామాజిక‌వ‌ర్గాన్ని చంద్ర‌బాబు మీద‌కు ఉసికొల్పే(Stone Pelting) ప్ర‌య‌త్నం జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. ఆ వ‌ర్గం ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌తో పాటు కోస్తా అంత‌టా బ‌లంగా ఉంటుంది. గంప‌గుత్త‌గా ఆ వ‌ర్గాన్ని ఓటు బ్యాంక్ గా మ‌లుచుకోవ‌డానికి వేసిన ఎత్తుగ‌డ‌లో భాగంగా చంద్ర‌బాబు మీద రాళ్ల దాడి జ‌రిగింద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని టాక్‌.

ఎర్ర‌గొండ‌పాలెంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌పై గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి టీడీపీ ఫిర్యాదు  

మార్కాపురం స‌భ త‌రువాత ఎర్ర‌గొండ‌పాలెం వెళ్లిన చంద్ర‌బాబు రోడ్ షో కు జ‌నం పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. ముందుగా ఇచ్చిన రూట్ మ్యాప్ ప్ర‌కారం కాన్వాయ్ వెళుతోంది. ఆలోపుగా వైసీపీ కార్య‌క‌ర్త‌లు చంద్ర‌బాబు కాన్వాయ్ వైపు దూసుకొచ్చారు. ఆయ‌న మీద రాళ్ల దాడికి(Stone Pelting) పాల్ప‌డ్డారు. హ‌ఠాత్ప‌రిణామం నుంచి చంద్ర‌బాబును కాపాడేందుకు క‌మాండోలు ప్ర‌య‌త్నం చేశారు. ఆ క్ర‌మంలో ఒక కమాండోకు గాయం అయింది. రెచ్చ‌గొడుతూ మంత్రి సురేష్ చొక్కా విప్పి చంద్ర‌బాబు(CBN) కాన్వాయ్ ముందు స‌వాల్ చేస్తూ నిల‌బ‌డ్డారు. ఇదంతా ద‌ళితుల‌ను రెచ్చ‌గొట్ట‌డానికి వైసీపీ వేసిన ఎత్తుగ‌డ‌గా టీడీపీ భావిస్తోంది. అందుకే సంయ‌మ‌నం పాటించింది. ఆ సంఘ‌ట‌న‌పై శ‌నివారం ఉద‌యం టెలీకాన్ష‌రెన్స్ ను చంద్ర‌బాబు నిర్వ‌హించారు. గ‌వ‌ర్న‌ర్ కు ఫిర్యాదు చేయాల‌ని నిర్ణ‌యించారు.

Also Read : HBD CBN : మారిన సాయిరెడ్డి, అన్న‌య్య‌కు హ్వాపీ బ‌ర్త్ డే

ఎర్ర‌గొండ‌పాలెంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌పై గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి ఫిర్యాదు చేయ‌డానికి టీడీపీ సిద్ధ‌మ‌యింది. అంతేకాదు, చంద్ర‌బాబు(CBN) మీద వైసీపీ దాడికి దిగే అవ‌కాశం ఉంద‌ని ముందుగా ప్ర‌కాశం, ప‌ల్నాడు, మార్కాపురం ఎస్పీల‌కు ఇచ్చిన ఫిర్యాదును కూడా గ‌వ‌ర్న‌ర్ కు అంద‌చేయ‌నుంది. పోలీసుల వ్య‌వ‌హారాన్ని గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద ఏక‌రువు పెట్ట‌డానికి సిద్ద‌మ‌వుతోంది. ద‌ళితుల్ని చంద్ర‌బాబుకు దూరం చేసే ప్ర‌య‌త్నం మంత్రి సురేష్ చేయ‌డాన్ని టీడీపీ తప్పుబ‌డుతోంది. ప్రాంతాలు, మ‌త‌, కుల ప్రాతిప‌దిక‌న ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తోన్న వైసీపీని నిలువ‌రించాల‌ని సంయ‌మ‌నం పాటిస్తూ రాజ్యాంగబ‌ద్ధంగా పోరాడాల‌ని ముందుకెళుతోంది.

Also Read : CBN : వైనాట్ పులివెందుల!క‌డ‌ప‌లో CBN 2డేస్ ఆప‌రేష‌న్