Site icon HashtagU Telugu

CBN Talks : చంద్ర‌బాబు ఢిల్లీ పొలిటిక‌ల్ ద‌ర్బార్

Cbn Talks

Cbn Talks

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు(CBN Talks) వ్యూహాత్మ‌క అడుగులు వేస్తున్నారు. ఆయ‌న ఒక జాతీయ ఇంగ్లీషు ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న సీనియార్టీని తెలియచేస్తున్నాయి. ప్ర‌ధాని మోడీ(Narendra Modi), చంద్ర‌బాబుకు మ‌ధ్య అంత‌రం ఉంద‌న్న భావ‌న ప్ర‌త్య‌ర్థుల్లో తొల‌గించే ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. అంతేకాదు, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో ప‌రోక్షంగా బీజేపీకి మ‌ద్ధ‌తు ప‌లుకుతున్న‌ట్టు చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఆయ‌న ప‌య‌నంపై ఇటీవ‌ల చ‌ర్చ జ‌రుగుతోన్న క్ర‌మంలో ఒక క్లారిటీ ఇచ్చేలా ఆయ‌న మాట‌లు ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు వ్యూహాత్మ‌క అడుగులు(CBN Talks) 

వాస్త‌వంగా జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెసేత‌ర పార్టీల క‌ల‌యిక(CBN Talks) ఢిల్లీ కేంద్రంగా రెండు రోజుల క్రితం క‌నిపించింది. ఆ కూట‌మికి సార‌థిగా బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్ర‌ముఖంగా వెలుగులోకి వ‌చ్చారు. జాతీయ స్థాయిలో బ‌ల‌మైన లీడ‌ర్ గా ఉన్న బెంగాల్ సీఎం మ‌మ‌త కూడా నితీష్ వైపు న‌డిచారు. ఫ‌లితంగా ప్ర‌త్యామ్నాయ కూట‌మి ఢిల్లీ కేంద్రంగా బ‌ల‌ప‌డుతోంద‌న్న భావ‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో బ‌య‌లు దేరింది. పైగా నితీష్ సుదీర్ఘ రాజకీయ ప్ర‌యాణంలో చంద్ర‌బాబు సాన్నిహిత్యం ఉంది. వాళ్లిద్ద‌రూ క‌లిసి ఎన్డీయేలో కీల‌కంగా వ్య‌వ‌హరించిన లీడ‌ర్లు. జాతీయ స్థాయిలో అంద‌ర్నీ ఒక చోట‌కు చేర్చే స‌త్తా ఉన్న లీడ‌ర్లుగా పేరుంది. రాజ‌కీయాల‌కు అతీతంగా మంచి స్నేహం కూడా నితీష్ కు చంద్ర‌బాబుతో ఉంది. ఆ సాన్నిహిత్యం ఇద్ద‌ర్నీ మ‌రోసారి ఒక‌టిగా చేస్తుంద‌ని జాతీయ రాజ‌కీయాల్లోని చ‌ర్చ‌.

నితీష్ ,చంద్ర‌బాబు సాన్నిహిత్యం 

ఇప్పుడున్న‌ ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు(CBN Talks) జూలు విదిల్చాల‌ని ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్, వైఎస్ ఆత్మ కేవీపీ రామ‌చంద్ర‌రావు అన్నారు. అంతేకాదు, ఫైర్ బ్రాండ్ రేణుకా చౌద‌రి కూడా దేశాన్ని కాపాడుకోవ‌డానికి చంద్ర‌బాబు ఇప్పుడు బ‌య‌ట‌కు రావాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. యూపీఏ ప‌క్షాలు కూడా చంద్ర‌బాబు మ‌ద్ధ‌తును కోరుకుంటున్నాయ‌. ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం రాత్రి ఒక జాతీయ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సంచ‌ల‌నం రేపుతోంది. మ‌ళ్లీ ఎన్డీయేలో (Narendra Modi) భాగ‌స్వామ్యం కావ‌డానికి చంద్ర‌బాబు ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చేలా ఆయ‌న మాట‌లు ఉన్నాయ‌ని భావిస్తున్న వాళ్లు అనేకులు.

ఎన్డీయేతో 2018 నుంచి టీడీపీ దూరం

ఎన్డీయేతో 2018 నుంచి టీడీపీ దూరంగా ఉంటోంది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో మోడీ (Narendra Modi) స‌ర్కార్ తో విభేదిస్తూ ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ రోజు నుంచి రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాడుతూ మోడీ స‌ర్కార్ తో వైరం పెట్టుకుంది. అయితే, అదంతా వ్య‌క్తిగ‌త‌మైన వైరం కాద‌ని మోడీ తెలియ‌చేసే ప్ర‌య‌త్నం జాతీయ ఛాన‌ల్ ఇంట‌ర్వ్యూలో చంద్రబాబు (CBN Talks) ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తీసుకున్న విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యాలు అన్నీ బాగున్నాయ‌ని ప్ర‌శంసించారు. జీఎస్టీ, నోట్ల ర‌ద్దు, సీఏఏ, ఆర్డిక‌ల్ 370 త‌దిత‌రాలంటికీ టీడీపీ మ‌ద్ధ‌తు ఇచ్చింది. రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లోనూ టీడీపీ మ‌ద్ధ‌తు భేష‌ర‌తుగా ప్ర‌క‌టించింది. అందుకే, విధాన‌ప‌ర‌మైన అంశాల విష‌యంలో ఎలాంటి విభేదాలు న‌రేంద్ర మోడీతో లేవ‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. అంటే, ఎన్డీయేతో క‌ల‌వ‌డానికి చంద్ర‌బాబు ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చార‌ని అర్థ‌మ‌వుతోందని ప్ర‌త్య‌ర్థులు భావిస్తున్నారు.

Also Read : CBN : వైనాట్ పులివెందుల!క‌డ‌ప‌లో CBN 2డేస్ ఆప‌రేష‌న్

వ్యూహాత్మకంగా చంద్ర‌బాబు(CBN Talks) టైమ్లీ ఇచ్చిన జాతీయ ఇంట‌ర్వ్యూ వెనుక బీజేపీ లేక‌పోలేద‌ని ఢిల్లీ వ‌ర్గాలు కొన్ని అనుమానిస్తున్నాయి. ఎందుకంటే క‌ర్ణాట‌క ఎన్నిక‌లు జ‌రుగుతోన్న వేళ చంద్ర‌బాబు అవ‌స‌రం బీజేపీకి ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ ప‌లు సంద‌ర్భాల్లో టీడీపీ మ‌ద్ధ‌తు ప‌లికింది. క‌ర్ణాట‌క‌, ఏపీ స‌రిహ‌ద్దుల్లోని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ప్ర‌భావం ఉంటుంది. అందుకే, చంద్ర‌బాబు ప‌రోక్షంగా బీజేపీకి మ‌ద్ధ‌తు ప‌లికేలా మాట్లాడార‌ని తెలుస్తోంది. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత రాజ‌కీయ ఈక్వేష‌న్లు పూర్తిగా మారిపోయే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. అందుకే, చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా మోడీకి(Narendra Modi) అనుకూల వ్యాఖ్య‌లు చేశార‌ని రాజ‌కీయా వ‌ర్గాల్లోని టాక్‌.

Also Read : TDP : చంద్ర‌బాబు ఆయుధాలు కోడిక‌త్తి,వివేకా హ‌త్య