Site icon HashtagU Telugu

CBN Slanderers : గ‌ద్ద‌ర్ పై కాల్పుల్లో నిజం ఇదే.!చంద్ర‌బాబుపై అప‌వాదులు.!

Cbn Slanderers

Cbn Slanderers

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు సుదీర్ఘ రాజ‌కీయ ప్రయాణంలో అనేక అప‌వాదులను(CBN Slanderers) ఎదుర్కొన్నారు. వాటిలో ఒక‌టి గ‌ద్ద‌ర్ పై కాల్పులు. ఆ సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు సీఎంగా చంద్ర‌బాబు ఉన్నారు. అందుకే, ఆ కాల్పులు చంద్ర‌బాబు చేయించార‌ని ప‌లువురు భావించారు. గద్దర్ అప్పట్లో నక్సలైట్లకు మద్దతుగా పాటలు పాడారు. ఆయన పాటలకు చాలా మంది ఆకర్షితులయ్యే వారని పోలీసుల అనుమానం. అందుకే గద్దర్‌ పై పలు కేసులు న‌మోదు చేశారు. ఆ త‌రువాత‌ 1997, ఏప్రిల్ 6న గద్దర్‌పై కొందరు కాల్పులు జరిపారు. ఆ హత్యాయత్నం దేశమంతా సంచలనం సృష్టించింది. ఆయనపై కాల్పులు జరిపింది ఎవరన్న విషయంపై అనేక రకాలుగా ప్రచారం జరిగింది.

చంద్ర‌బాబు సుదీర్ఘ రాజ‌కీయ ప్రయాణంలో అనేక అప‌వాదులను(CBN Slanderers)

నిందితులను పోలీసులు పట్టుకోలేకపోయారు. ఇప్ప‌టికే కాల్పులు జ‌రిపిన వాళ్లు ఎవ‌రు అనేది తెలియ‌దు. కానీ, ఆనాడు సీఎంగా ఉన్న చంద్ర‌బాబుకు తెలిసే ఆ కాల్పులు జ‌రిగాయ‌ని ప్ర‌చారం బ‌లంగా న‌డిచింది. అప్పట్లో గద్దర్ శరీరంలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. వైద్యులు చికిత్స అందించారు. గద్దర్ శరీరంలో ఒక్క బుల్లెట్‌ను మాత్రం తొలగించలేకపోయారు. ఆ బుల్లెట్ తొలగిస్తే ఆయన ప్రాణాలకి ముప్పు ఉంటుందని దాన్ని అలాగే వదిలేశారు. శరీరంలో ఆ బుల్లెట్ తోనే జీవించిన ఆయ‌న ఇటీవ‌ల మ‌ర‌ణించారు. ప్ర‌భుత్వం ప‌రంగా అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు జ‌రిపారు. ఆ స‌మ‌యంలో బిజీగా ఉన్న ఆయ‌న చంద్ర‌బాబు మంగ‌ళ‌వారం గ‌ద్ద‌ర్ ఇంటికి వెళ్లారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించారు. ఆ త‌రువాత గ‌ద్ద‌ర్ మీద 1997లో జ‌రిగిన కాల్పుల గురించి ప్ర‌స్తావించ‌డం(CBN Slanderers) చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

గ‌ద్ద‌ర్ పై కాల్పుల ఘటనలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన

కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించిన చంద్ర‌బాబు గ‌ద్ద‌ర్ పై జ‌రిగిన కాల్పుల ఘటన విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. కొన్ని అపోహలు సృష్టించారని అన్నారు. ‘‘నాటి కాల్పుల తర్వాత గద్దర్ నాతో అనేకసార్లు మాట్లాడారు. ఇద్దరం కలిసి పని చేశాం. నా లక్ష్యం, గద్దర్ లక్ష్యం ఒక్కటే. పేదల హక్కుల పరిరక్షణే మా ధ్యేయం” అని వివరించారు. బుల్లెట్ నుంచి బ్యాలెట్ కు మ‌ళ్లిన గ‌ద్ద‌ర్ ల‌క్ష్యం ప్ర‌జాస్వామ్య‌యుతంగా పేద‌ల‌కు సేవ చేయ‌డం. ఆ ల‌క్ష్యం దిశ‌గా ప‌నిచేస్తున్నానంటూ చంద్ర‌బాబు (CBN Slanderers) వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.

Also Read : CBN Prediction : మంచిరోజులు!చంద్ర‌బాబు ఆశాభావం!

`వ్య‌వ‌సాయం దండ‌గ..`అన్న‌ట్టు చంద్ర‌బాబు అన్నార‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింది. ఆ విధంగా అన్న‌ట్టు ఎక్క‌డైనా ఉందా? చూపించండ‌మ‌ని చంద్ర‌బాబు ప‌లుమార్లు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను నిల‌దీశారు. అసెంబ్లీ లోప‌ల‌, బ‌య‌ట చంద్ర‌బాబు రైతు వ్య‌తిరేకి అంటూ ప్ర‌త్య‌ర్థులు బ‌ల‌మైన ముద్ర‌వేశారు. కానీ, చంద్ర‌బాబు `వ్య‌వసాయం దండ‌గ‌.` అన్న‌ట్టు ఎక్క‌డా లేదు. అప్ప‌ట్లో టీడీపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసిన ఒక ప‌త్రిక వండివార్చిన ఒక క‌థ‌నంలో ఆ వ్యాఖ్యాన్ని చొప్పించింది. అదే చంద్ర‌బాబు మీద చెర‌గ‌ని రైతు వ్య‌తిరేకి ముద్ర‌ప‌డింది. అప్ప‌ట్లో బిల్ క్లింట‌న్ హైద‌రాబాద్ వ‌స్తోన్న సంద‌ర్భంగా బిక్ష‌గాళ్ల‌ను న‌గ‌ర శివార్ల‌కు త‌ర‌లించే ప్ర‌య‌త్నం జరిగింది. ఏర్పాట్ల‌లో భాగంగా అధికారులు ఆ ప‌నిచేశారు. దాన్ని కూడా చంద్ర‌బాబు కు అపాదించారు. పేద‌ల వ్య‌తిరేకి చంద్ర‌బాబు అనే మ‌రో అపోహ‌ను (CBN Slanderers) ఆయ‌న మీద క్రియేట్ చేశారు.

త‌ను నిద్ర‌పోడు ఎవ‌ర్నీ నిద్ర‌పోనివ్వ‌డు..` అంటూ మ‌రో అప‌వాదు

`త‌ను నిద్ర‌పోడు ఎవ‌ర్నీ నిద్ర‌పోనివ్వ‌డు..` అంటూ మ‌రో అప‌వాదును  (CBN Slanderers) ఆయ‌న మీద అధికారులు క్రియేట్ చేశారు. వాస్త‌వంగా ఆయ‌న దైనందిన జీవితం చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ఉంటుంది. ప్ర‌తి రోజూల ఉద‌యం 3 గంట‌ల‌కు లేస్తారు. యోగా చేస్తారు. ఆ త‌రువాత ప్ర‌భుత్వ కార్యక్ర‌మాల్లో బిజీ అవుతారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ నుంచి ఆ ప‌ద్ధ‌తిని ఆయ‌న నేర్చుకున్నారు. రివ్యూ మీటింగ్ ల‌ను పెడుతూ ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌గ‌తి రిపోర్టును తీసుకోవడం ఆయన‌కు దైనందిన జీవితంలో ఒక భాగం. దానికి అనుగుణంగా న‌డుచుకోలేని అధికారులు త‌ను నిద్ర‌పోడు ఎవ‌ర్నీ నిద్ర‌పోనివ్వ‌డ‌ని..` ముద్ర‌వేశారు. కానీ, ఆయ‌న హాయిగా ఎంత అవ‌స‌ర‌మో అంత నిద్ర‌పోతారు.

Also Read : CBN Achievement : చంద్ర‌బాబు తుఫాన్! TDPలోకి బాలినేని?

స్వ‌ర్గీయ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర‌హాలో `సొంత మ‌నుషుల‌కు స‌హాయం చేయ‌డు, ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డు ` అనే అప‌వాదు కూడా ఉంది. కానీ, ఆయ‌న్ను ద‌గ్గ‌ర నుంచి చూసిన వాళ్లు ఆ అప‌వాదు ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని ఎవ‌రైనా చెబుతారు. ఎందుకంటే, చేసిన స‌హాయ‌న్ని బ‌య‌ట‌కు రానివ్వ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంటారు చంద్ర‌బాబు. మూడో కంటికి తెలియ‌కుండా స‌హాయం చేస్తుంటారు. స‌హాయం పొందిన వాళ్లు కూడా బ‌య‌ట ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతుంటారు. పెళ్లిళ్లు,పేరంటాలు, ఇత‌ర‌త్రా ఫంక్ష‌న్ల‌కు సొంత పార్టీ నేత‌ల‌కు అనేక మందికి ఆర్థిక స‌హాయం చంద్ర‌బాబు చేశారు. అంతేకాదు, పార్టీ ఆఫీస్ లో ప‌నిచేసే వాళ్లు చాలా మంది ప్ర‌స్తుతం పారిశ్రామిక వేత్త‌లుగా మారారు. కృష్ణా జిల్లా నుంచి భుజం మీద కండువాతో మాత్ర‌మే వ‌చ్చిన కొంద‌రు వేల కోట్ల అధిప‌తులు అయ్యారు. అదంతా చంద్ర‌బాబు ఇచ్చిన ప్రోత్సాహ‌మే.

Also Read : YCP Sketch : TDP,JSP మ‌ధ్య‌లో సాయిరెడ్డి `అగ్గి`

సొంత కులం వాళ్ల‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డు అనేది మాత్రం నిజం. ఎందుకో, తొలి నుంచి మిగిలిన కులాల వాళ్ల‌ను చేర‌దీస్తారు. సొంత‌కుల‌పోళ్ల‌ను ఎక్కిరానివ్వ‌డ‌ని అప‌వాదు ఉంది. అందులో కొంత వ‌ర‌కు నిజం లేక‌పోలేదు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయ‌కులు అనేక మంది ఆయ‌న వ‌ద్ద స‌హాయం పొందిన వాళ్లే. కానీ, చంద్ర‌బాబు ఏమీ చేయ‌లేదంటూ స‌హాయం పొంద‌ని వాళ్లు వేసే అపవాదు. ఎవ‌రైనా కొంద‌రికి మాత్ర‌మే స‌హాయం చేయ‌గ‌ల‌రు. అంద‌రికీ చేయ‌లేరు. ఎవ‌రికి అవ‌స‌ర‌మో వాళ్ల‌కు స‌హాయం చేస్తుంటారు చంద్ర‌బాబు. ఎవ‌ర్నీ న‌మ్మ‌డు చంద్ర‌బాబు అనే అప‌వాదు ఆయ‌న పై ఉంది. కానీ, ఆయ‌న న‌చ్చేలా అబ‌ద్దాలు చెప్పినా గుడ్డిగా న‌మ్ముతారు. ఇలా ఆయ‌న మీద ఉన్న ప‌లు అప‌వాదుల్లో ఒక‌టి గ‌ద్ద‌ర్ మీద చంద్ర‌బాబు కాల్పులు జ‌రిపించారు అనేది. అందుకే, స్వాతంత్ర్య దినోత్స‌వం నాడు ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌యాణంలో ఆయ‌న మీద వ‌చ్చిన అప‌వాదుల్లో అదొక‌టిగా ఇప్పుడు తేలింది.