Site icon HashtagU Telugu

AP: అన్నమయ్య ప్రాజెక్టు కాపాడలేని చెత్త సీఎం మూడు రాజధానులు కడతాడంట – CBN

Cbn Jagan

Cbn Jagan

ఏపీ ఎన్నికల ప్రచారం (AP Election Campaign)లో చంద్రబాబు (Chandrababu) తన దూకుడును కనపరుస్తున్నాడు. 40 డిగ్రీల ఎండను సైతం ఏమాత్రం లెక్కచేయకుండా ప్రచారం చేస్తూ..కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. బాబు వయసులో సగం వయసున్న వైసీపీ నేతలు ఎండవేడిని తట్టుకోలేక కుప్పకూలిపోతుంటే..బాబు మాత్రం 25 ఏళ్ల యువకుడిలా జోరు చూపిస్తున్నాడు. ఓ పక్క పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతూనే..సీఎం జగన్ ఫై నిపీలు చెరుగుతూ వైసీపీ శ్రేణుల్లో చెమటలు పట్టిస్తున్నాడు. అగ్గికి వాయువు తోడు అయినట్టు.. బాబు కు తోడుగా పవన్ కళ్యాణ్ కూడా జగన్ (Jagan) ఫై ఘటన విమర్శలు చేస్తుండడం..వీరి ప్రచారానికి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో నిర్వహించిన ఎన్డీయే కూటమి సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ ఒక అహంకారి అని, రాష్ట్రాన్ని దోచేసిన ఆ వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐదేళ్ల పాటు పరదాలు కట్టుకుని తిరిగాడని విమర్శించారు. ఇక్కడే ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా సీఎం పనిచేశారు, నేను 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నాను… ఏనాడైనా మేం పరదాలు కట్టుకుని తిరిగామా? అని బాబు ప్రశ్నించారు. అన్నమయ్య ప్రాజెక్టు కాపాడలేని ఈ చెత్త ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట. అన్నమయ్య ప్రాజెక్టు ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టించలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతా అంటే ఎవరైనా నమ్ముతారా? అని ప్రశ్నించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య ప్రాజెక్టును బాగు చేస్తామని తెలిపారు. ప్రాజెక్టు బాధితులను ఆదుకుంటామని తెలిపారు. పేదలకు రెండు, మూడు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి, ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్‌ నుంచే పింఛను రూ.4వేలు ఇంటి వద్దే ఇస్తామన్నారు. 3 నెలల బకాయిలు జులైలో ఇస్తామని తెలిపారు. టీడీపీ మద్దతుదారుల పింఛన్లు తీసేశారని, టీడీపీ వచ్చాక మళ్లీ పింఛన్లు పునరుద్ధరిస్తామని తెలిపారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చే వరకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తిరుగుబాటు మొదలైందని.. జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని చంద్రబాబు జోష్యం చెప్పారు.

Read Also : Lok Sabha Polls : నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని వెనక్కు పంపిన అధికారులు