CBN Raksha Bandhan : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆలోచన మారింది. ఆయన రాజకీయ పోకడ గతానికి భిన్నంగా ఉంది. భవిష్యత్ గురించి ఆలోచించే దిశగా ప్రజలను సిద్ధం చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రతి ఇంటిలో సొంత మనిషిగా ప్రజలు భావించేలా ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రాఖీలను (CBN Raksha Bandhan) పంపే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే మహాశక్తి పేరుతో మహిళలకు కొన్ని స్కీమ్ లను ప్రకటించిన ఆయన ఇప్పుడు అందరికీ అన్నయ్యలా చేరువకావడానికి వినూత్నంగా ఆలోచించారు. రాఖీ పండుగను అందుకు సానుకూలంగా మలుచుకుంటున్నారు.
ఏపీ రాష్ట్ర భవిష్యత్ కు చంద్రబాబు రక్షాబంధన్ (CBN Raksha Bandhan)
ప్రస్తుతం నిజ శ్రావణమాసంలో ఉన్నాం. ఈ నెల 30న రాఖీ పండగ వస్తుంది. ఆ రోజున ప్రతి మహిళ రాఖీ కోవాలని (CBN Raksha Bandhan) చంద్రబాబు పిలుపునిస్తున్నారు. అన్నయ్యగా భావిస్తూ రాఖీ కట్టుకునే సమయంలో టీడీపీకి ఓటు వేస్తానని దృఢనిర్ణయం తీసుకోవాలని పిలుపునివ్వడం గమనార్హం. కొన్ని రాఖీలను కూడా పార్టీ పరంగా తయారు చేస్తున్నారు. వాటిని గ్రామ కమిటీల ద్వారా పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆధ్మాత్మిక కోణం నుంచి రాష్ట్ర భవిష్యత్ ను ఆలోచించే దిశగా చంద్రబాబు ప్రజల మైండ్ ను సెట్ చేస్తున్నారు.
రాఖీ కట్టుకునే సమయంలో టీడీపీకి ఓటు వేస్తానని దృఢనిర్ణయం
ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తోన్న చంద్రబాబు కోనసీమకు చేరుకున్నారు. ప్రాజెక్టుల పర్యటన చేస్తోన్న ఆయన ఆయా ప్రాంతాలకు 2019 నుంచి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు విశాఖ కేంద్రంగా విజన్ 2047ను ఆవిష్కరించారు. అప్పటికి ఏపీ ఎలా ఉండనుంది? అనే ఆలోచన కలిగించేలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలోని వనరుల గురించి వివరించారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి, విశాఖ రైల్వే జోన్ తదితరాలను ప్రస్తావించారు. నెంబర్ 1 రాష్ట్రంలో 2029కు ఏపీ అయ్యేలా ప్లాన్ ను చూపించారు చంద్రబాబు. దానిపై ప్రజల్లో చర్చ జరగాలని కోరుకుంటున్నారు. దేశం, రాష్ట్రం భవిష్యత్ గురించి ఆలోచించి (CBN Raksha Bandhan) ఓటేయాలని పిలుపు నిస్తున్నారు.
Also Read : CBN Slanderers : గద్దర్ పై కాల్పుల్లో నిజం ఇదే.!చంద్రబాబుపై అపవాదులు.!
ప్రస్తుతం కోనసీమలో పర్యటిస్తోన్న చంద్రబాబు రాఖీపౌర్ణమి గురించి ప్రస్తావిస్తున్నారు. దాని విశిష్టతను తెలియచేస్తూ ఆ రోజున టీడీపీకి ఓటేస్తామని ప్రతిజ్ఞ తీసుకోవాలని మహిళలకు పిలుపునిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ చిహ్నంతో కూడిన రాఖీలను తయారు చేస్తున్నారు. ఇంటికి పెద్దన్నయ్యలా భావిస్తూ రాఖీ కట్టుకోవాలని సూచిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ రాఖీలు త్వరలోనే విడుదల కాబోతున్నాయి. ఇంకా రెండు వారాల టైమ్ రాఖీ పండుగ కు ఉంది. ఆ రోజుకు అందరికీ రాఖీలు అందచేసేలా టీడీపీ ప్రయత్నం చేస్తోంది. ప్రతి ఒక్కరూ రాష్ట్ర భవిష్యత్ ను ఆలోచిస్తూ ఉండాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఆ దిశగా మారుమూల గ్రామాల్లోనూ చర్చ జరిగేలా క్యాడర్ ముందుకు నడవాలని దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తం మీద ప్రజల ఆలోచన శైలిని మార్చడానికి చంద్రబాబు చేస్తోన్న ప్రయత్నాల్లో ఇదో కొత్త కోణంలా కనిపిస్తోంది.
Also Read : CBN Achievement : చంద్రబాబు తుఫాన్! TDPలోకి బాలినేని?