CBN Praja Vedika : చంద్ర‌బాబు సంస్క‌ర‌ణ‌లు-మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం

CBN Praja Vedika : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌ను వేగంగా అమ‌లు చేసిన దార్శినికుడు.

  • Written By:
  • Publish Date - September 8, 2023 / 02:57 PM IST

CBN Praja Vedika : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌ను వేగంగా అమ‌లు చేసిన దార్శినికుడు. స్వ‌ర్గీయ పీవీ బాట‌లో న‌డిచారు. తొలి ద‌శ సంస్క‌ర‌ణ‌ల‌ను చేప‌ట్టిన నేత‌ల్లో ప్ర‌ధ‌ముడు. మూడో ద‌శ సంస్క‌ర‌ణ‌లు వేగంగా భార‌త‌దేశాన్ని మార్చేస్తున్న త‌రుణంలో లాభ‌, న‌ష్టాల‌ను చంద్ర‌బాబు బేరీజు వేశారు. ధ‌నికులు కుబేరులుగా మారుతున్నార‌ని ఆందోళ‌న చెందారు. ధ‌నికుల సంఖ్య పెరిగిపోతుంద‌ని గ్ర‌హించారు. ఆ విష‌యాన్ని అనంత‌పురం జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లి కేంద్రంగా వెల్ల‌డించారు.

ధ‌నం, భూమి కంటే ప్ర‌జ‌లే త‌న గొప్ప ఆస్తి (CBN Praja Vedika)

ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు ప‌క్క‌దోవ ప‌ట్ట‌డాన్ని చంద్ర‌బాబు సీరియ‌స్ గా ( CBN Praja Vedika) తీసుకున్నారు. ప్ర‌త్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ధ‌నికులు పెరిగిపోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పేద‌ల‌ను కాపాడుకోవాల‌ని ఆయ‌న ఆలోచిస్తున్నారు. అందుకే, విజ‌న్ 2047 ను రూపొందించారు. దాన్ని దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని కోరుతున్నారు. పీ 4 మోడ‌ల్ ను అమ‌లు చేయాల‌ని కోరుతున్నారు. ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం, ప్రైవేటు భాగ‌స్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాల‌ని కోరుతున్నారు. ఆ దిశ‌గా ప్ర‌భుత్వాలు ఆలోచిస్తే, రాబోవు రోజుల్లో పేద‌ల‌ను కోటీశ్వ‌రులుగా మార్చ‌డానికి అవకాశం ఉంద‌ని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బాబు ష్యూరిటీ- భ‌విష్య‌త్ గ్యారంటీ ప్రోగ్రామ్ ను ఆయ‌న నిర్వ‌హిస్తున్నారు. ఆ సంద‌ర్భంగా రాష్ట్రంలోని ప‌రిస్థితుల‌ను తెలియ‌చేస్తూ భ‌విష్య‌త్ ను ఆవిష్క‌రిస్తున్నారు.

ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు ప‌క్క‌దోవ ప‌ట్ట‌డాన్ని చంద్ర‌బాబు సీరియ‌స్ గా

వాస్త‌వంగా తొలి ద‌శ సంస్క‌ర‌ణ‌లు దేశ వ్యాప్తంగా ప‌లు మార్పుల‌ను ( CBN Praja Vedika) తీసుకొచ్చాయి. రెండో ద‌శ సంస్క‌ర‌ణ‌లు వ‌చ్చే నాటికి పేద‌లు, ధ‌నికుల మ‌ధ్య అంత‌రం పెరిగింది. ఇప్పుడు మూడో ద‌శ సంస్క‌ర‌ణ‌లు అమ‌లు అవుతోన్న త‌రుణంలో పేద‌లు, ధ‌నికుల మ‌ధ్య గ్యాప్ మ‌రింత పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇదే త‌ర‌హాలో ధ‌నికుల సంఖ్య ప్ర‌తి ఏడాది పెరిగిపోతుంటే, స‌మాజంలో అస‌హ‌నం పెరిగే ప్ర‌మాదం ఉంది. ఫ‌లితంగా సోమాలియా, ఉత్త‌ర కొరియా, శ్రీలంక త‌ర‌హా ప‌రిస్థితుల‌ను దేశంలోనూ చూడాల్సి వస్తుంది. అందుకే, చంద్ర‌బాబు ముందుగా స‌మాజాన్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల‌ను మేల్కొలుపుతున్నారు. విజ‌న్ 2047 లో భాగంగా విజ‌న్ 2029ను అమ‌లు చేయాల‌ని కోరుతున్నారు.

మాన‌వాభివృద్ధి సూచిక‌లో బీహార్ కంటే కింద (CBN Praja Vedika)

మాన‌వాభివృద్ధి సూచిక‌లో పాకిస్తాన్ కంటే భార‌త్ వెనుక‌బ‌డి ఉంది. తెలుగు రాష్ట్రాలు మాన‌వాభివృద్ధి సూచిక‌లో బీహార్ కంటే కింద ఉన్నాయి. అంటే, పేద‌లు-ధ‌నికుల మ‌ధ్య అంత‌రం ఈ రాష్ట్రాల్లో మ‌రింత ఎక్కువ‌గా ఉంది. స‌హ‌జంగా త‌ల‌స‌రి ఆదాయాన్ని చూపుతూ రాష్ట్రాలు దూసుకుపోతున్నాయ‌ని చెబుతున్నారు. వాస్త‌వాభివృద్ధికి భిన్నంగా త‌ల‌స‌రి ఆదాయం లెక్క‌లు ఉంటాయ‌ని కామ‌ర్స్ విద్యార్థుల‌కు మాత్ర‌మే తెలుసు. అందుకే, ఆ విష‌యాన్ని చంద్ర‌బాబు గ్ర‌హించారు. పేద‌ల‌ను కోటీశ్వ‌రులుగా మార్చ‌డానికి పీ 4 ఫార్ములాను త‌యారు చేశారు. దానితో పేద‌, ధ‌నికుల మ‌ధ్య అంత‌రాన్ని త‌గ్గించ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని  ( CBN Praja Vedika) ఆయ‌న భావిస్తున్నారు.

కోటీశ్వ‌రులుగా మార్చ‌డానికి పీ 4 ఫార్ములా

ప్ర‌స్తుతం పీపీపీ మోడల్ ను చూస్తున్నాం. గ‌త రెండు ద‌శ‌ల్లో జ‌రిగిన సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా పీపీపీ మోడ‌ల్ అభివృద్ధి వేగం పుంజుకుంది. ఇప్పుడు పీపీపీ మోడ‌ల్ కు మ‌రో పీ(ప్ర‌జ‌లు)ను అనుసంధానం చేయాల‌ని చంద్ర‌బాబు కోరుతున్నారు. అప్పుడు ప్ర‌జ‌లు కూడా పారిశ్రామిక‌వేత్త‌లుగా మార‌తార‌ని చెబుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అసంఘిటితంగా ఉన్న ప్ర‌జ‌లు అనేక మంది ఉన్నారు. వాళ్ల‌కు పాన్ కార్డ్ ఉండ‌దు. లోన్ల‌ను తీసుకోలేరు. కానీ, పీపీపీ మోడ‌ల్ కు వాళ్ల‌ను అనుసంధానం చేయ‌గ‌లిగితే పాన్ కార్డ్ తో బ్యాంకు లోన్ల‌ను తీసుకునే వెసుల‌బాటు క‌లుగుతుంది. అప్పుడు పారిశ్రామిక వేత్త‌లుగా మార‌తారు. ఫ‌లితంగా కోటీశ్వ‌రులు ( CBN Praja Vedika) అవుతార‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

Also Read : CBN Daring : బాంబుల‌కే భ‌య‌ప‌డ‌ని చంద్ర‌బాబు

దేశ వ్యాప్తంగా నాలుగో ద‌శ సంస్క‌ర‌ణ‌ల‌కు నాంది ప‌లుకుతోన్న స‌మ‌యంలో మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించ‌డానికి పీ 4 ఫార్ముల‌ను అమ‌లు చేయాల‌ని చంద్ర‌బాబు సూచిస్తున్నారు. సాధార‌ణంగా ఏదైనా ప్రాజెక్టును ప్రైవేటు వ్య‌క్తులు చేప‌డ‌తారు. అందుకు ప్ర‌భుత్వం స‌హ‌కారం అందిస్తోంది. ప్ర‌భుత్వం, ప్రైవేటు భాగ‌స్వామ్యంతో ప‌లు ప్రాజెక్టులు న‌డుస్తున్నాయి. వాటి అనుబంధ ప‌నుల‌ను ప్ర‌జ‌ల‌కు ఇవ్వ‌డం ద్వారా భాగ‌స్వాముల‌ను చేయాల‌ని కోరుతున్నారు. అదే జ‌రిగితే సంస్క‌ర‌ణ‌లు అర్థ‌వంతమైన ఫ‌లితాల‌ను ఇస్తాయ‌ని చంద్ర‌బాబు లెక్క‌. ఆ విష‌యాన్ని బ‌న‌గాన‌ప‌ల్లిలో జ‌రిగిన మ‌హిళా స‌ద‌స్సులో ఆయ‌న వివ‌రించారు.

Also Read : CBN Arrest : రెండు రోజుల్లో అరెస్ట్, చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మ‌హాశ‌క్తి పేరుతో ఇప్ప‌టికే మినీ మేనిఫెస్టోను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు టీడీపీ తీసుకెళుతోంది. దానికి తోడుగా ఇప్పుడు పీ 4 ఫార్ములాను జోడించ‌డం ద్వారా విజ‌న్ 2029 దిశ‌గా ఏపీని నెంబ‌ర్ 1గా నిల‌పాల‌ని చంద్ర‌బాబు క‌ల‌లు కంటున్నారు. దానికి ప్ర‌జా స‌హ‌కారాన్ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు ప‌ర్య‌టిస్తూ క్యాడ‌ర్ ను కూడా ఆ దిశ‌గా ప‌రుగులు పెట్టిస్తున్నారు. మ‌హిళా ప్ర‌జా వేదిక‌ను ఏర్పాటు చేసిన చంద్ర‌బాబు బ‌న‌గాన‌ప‌ల్లిలో ధ‌నం, భూమి కంటే ప్ర‌జ‌లే త‌న గొప్ప ఆస్తి అంటూ ప్ర‌క‌టించారు.