CBN No Arrest : `మొరగని కుక్క లేదు, విమర్శించిన నోరు లేదు..ఈ రెండులేని ఊరు లేదు..మనపని మనం చేసుకుని వెళుతుండడమే..`తెలిసిందా రాజా..! అంటూ ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ `జైలర్` ట్రైలర్ విడుదల సందర్భంగా వాడిన డైలాగ్. దాన్ని చంద్రబాబుకు వర్తింప చేస్తే సరిగ్గా సరిపోతోంది. అధికారపక్షం ఆయన మీద ఎన్ని విమర్శలు చేసినప్పటికీ ప్రజల్లో ఉండడం మాత్రం మానడంలేదు. `బాబు గ్యారంటీ-భవిష్యత్ కు ష్యూరిటీ` ప్రోగ్రామ్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లాల్లో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రజల్లోకి వెళుతూ రాష్ట్రం వెనుకబడిన విషయంపై ఆలోచింప చేస్తూ ప్రసంగిస్తున్నారు.
బాబు గ్యారంటీ-భవిష్యత్ కు ష్యూరిటీ` ప్రోగ్రామ్ (CBN No Arrest)
గత రెండేళ్లుగా క్రమ పద్ధతిన ఆయన ప్రోగ్రామ్ లను డిజైన్ చేసుకుంటున్నారు. ఏడాది పాటు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను నిర్వహించారు. ఆ క్రమంలో మినీ మహానాడు కార్యక్రమాలను పెట్టారు. మహానాడును ఒంగోలు కేంద్రంగా నిర్వహించడం ద్వారా టీడీపీకి కొత్త ఉత్సాహం వచ్చింది. అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ మినీ మహానాడులను రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు. ఆ తరువాత `ఇదే ఖర్మ రాష్ట్రానికి..` అంటూ ప్రతి వారం మూడు రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లారు. రోడ్ షోలు, నియోజకవర్గాల వారీగా రివ్యూలను పెట్టారు. బహిరంగ సభలను నిర్వహించారు. ఆ సందర్భంగా గుంటూరు, నెల్లూరు జిల్లా కందుకూరు ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. దీంతో జీవో నెంబర్ 1ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆయన ప్రోగ్రామ్ లను ఆపాలని (CBN No Arrest) ప్రయత్నం చేసింది.
చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రాజెక్టుల బాట
న్యాయస్థానాలకు వెళ్లిన తరువాత జీవో నెంబర్ 1 నుంచి కొంత ఉపశమనం లభించింది. అయినప్పటికీ పోలీసుల ఆంక్షల నడుమ ప్రోగ్రామ్ లను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలోపుగా జనసేనాని పవన్ వారాహి వాహనం ఎక్కారు. అధికారంలోని జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడడం ప్రారంభించారు. ఆ ఒరవడిలో చంద్రబాబు కొంత వెనక్కు తగ్గినట్టు కనిపించింది. అటు వైసీపీ ఇటు జనసేన వ్యక్తిగత, ప్రైవేటు జీవితాలపై విమర్శలు, ఆరోపణల హోరు నడుమ టీడీపీ వెనుకబడింది. అదే సందర్భంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా ప్రాజెక్టుల బాట పట్టారు. గత నాలుగున్నరేళ్లుగా నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రజల్ని ఆలోచింప చేసేలా (CBN No Arrest) మైండ్ సెట్ చేశారు.
న్యాయస్థానాలకు వెళ్లిన తరువాత జీవో నెంబర్ 1 నుంచి ఉపశమనం
పది రోజుల పాటు ప్రాజెక్టుల బాట పట్టారు. ఆ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు పెట్టింది. వాటిని అధిగమిస్తూ రాయలసీమ మీదుగా కోస్తా, ఉత్తరాంధ్ర వరకు వెళ్లారు. అన్ని ప్రాజెక్టులను సందర్శించారు. రాష్ట్రం 20ఏళ్లు వెనక్కు పోయేలా వనరుల రూపకల్పనలో జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపారు. పోలవరంపై జరిగిన మోసాన్ని ఎత్తిచూపారు. ప్రాజెక్టుల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్లక్ష్యాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లారు. వాటి మీద చర్చ జరిగేలా ప్రయత్నం చేసి విజయం సాధించారు. ఆ తరువాత ఇసుక, మద్యం స్కామ్ ల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకే, బాబు ష్యూరిటీ–భవిష్యత్ కు గ్యారంటీ ప్రోగ్రామ్ తో ఏపీ పునర్నిర్మాణం(CBN No Arrest) అంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. రాబోవు 45 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ ను కంటిన్యూ చేయాలని దూకుడుగా ముందుకు సాగుతున్నారు.
Also Read : CBN IT Issue : చంద్రబాబు అరెస్ట్ సాధ్యమా?
ప్రజల్లోకి చంద్రబాబు దూకుడుగా వెళుతోన్న సందర్భంలో ఆయనకు ఇచ్చిన ఐటీ నోటీసులను వైసీపీ బయటపెట్టింది. ఆయన ప్రోగ్రామ్ ను ప్రజల మైండ్ ను డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేసింది. ఎప్పుడో ఇచ్చిన ఐటీ నోటీసులను చర్చలోకి తీసుకొచ్చింది. సీఎంగా ఉండగా 2014 నుంచి 2019 మధ్యలో 118 కోట్ల ముడుపులు తీసుకున్నాడని చంద్రబాబు మీద అభియోగం మోపారు. ఇంకేముంది ఆయన్ను అరెస్ట్ చేయబోతున్నారంటూ వైసీపీ ప్రచారాన్ని ఉధృతం చేసింది. కానీ, లెక్క చూపని 118 కోట్ల ఐటీ శాఖ తెలుసుకుందని ఆ నోటీసుల్లోని సారాంశం. ఆ మేరకు ఒక కంపెనీకి చెందిన మనోజ్ అనే వ్యక్తి నుంచి వాగ్మూలం తీసుకుంది. అలాగే, మాజీ పీఎస్ శ్రీనివాస్ వాగ్మూలం కూడా ఐటీ తీసుకుంది.
Also Read : CBN Plan 45 : భవిష్యత్ కు 45 రోజుల ప్రణాళిక, చంద్రబాబు దూకుడు
కానీ, వాళ్లిద్దరూ బలవంతంగా సంతకం చేయించుకున్నారని కోర్టులో పిటిషన్ వేశారు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు మీద ఎలా చర్యలు తీసుకుంటారు? అనేది లాజిక్. అలాగే, ఆయన్ను అరెస్ట్ చేయాలంటే..ఈడీ, సీబీఐ, సివిల్ పోలీస్, న్యాయస్థానం ఆదేశం ఇలా ఉండాలి. కానీ, ఐటీ అరెస్ట్ చేయడం ఎక్కడా లేదు. అయినప్పటికీ వైసీపీ మీద చంద్రబాబు అరెస్ట్ అంటూ హోరెత్తిస్తోంది. ఇదంతా చంద్రబాబు పర్యటన గురించి ప్రజల్లో చర్చ జరగకుండా చేసే డైవర్షన్ పాలిటిక్స్ గా చూడాల్సి ఉంటుంది. అందుకే, చంద్రబాబు మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన డైలాగ్ మాదిరిగా తనపని తాను చేసుకుని వెళుతున్నారు.