CBN : ఇది కదా బాబు అంటే..తప్పు చేస్తే సొంత పార్టీ వారికైనా శిక్ష పడాల్సిందే !

CBN : వైఎస్ భారతి(YS Bharathi)పై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఘటనపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు

Published By: HashtagU Telugu Desk
Cbn Mark

Cbn Mark

వైసీపీ (YCP) హయాంలో ఎదురైన అనేక అన్యాయాలు, మహిళల(womens)పై దాడులు, అసభ్య వ్యాఖ్యలు ప్రజల మదిలో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై వ్యక్తిగత దూషణలతో పాటు వారి కుటుంబ సభ్యులపై కూడా నీచంగా కామెంట్లు చేసిన ఘటనలు విస్తృతంగా కలకలం రేపాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో బ్లూ టిమ్ (Blue Team) అనే పేరుతో అసభ్యమైన భాషను వినిపించిన సందర్భాలు రాష్ట్ర ప్రజలు మరిచిపోలేరు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మాత్రం అలా కాదు అని నిరూపిస్తున్నారు. స్వపక్షంలో ఏ తప్పు జరిగినా కూడా సహించమన్న ధోరణితో ముందుకు వెళ్లుతున్నారు.

Tragedy : నెల్లూరులో మహిళను వివస్త్రను చేసి కొట్టిచంపారా?

తాజాగా టీడీపీకి చెందిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ (Chebrolu Kiran) వైఎస్ భారతి(YS Bharathi)పై అసభ్య వ్యాఖ్యలు చేసిన ఘటనపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా, అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ఆదేశించడం ఆయన నైతికతకు నిదర్శనంగా నిలిచింది. పార్టీ కార్యకర్త అయినా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి తీరే చంద్రబాబును ఇతర నేతల కంటే భిన్నంగా నిలబెడుతోంది. క్షమాపణలు చెప్పినా సరే, చేసిన తప్పుకి తగిన శిక్ష తప్పదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు.

ఇది చూసిన ప్రజలు “దటీజ్ బాబు” అని ప్రశంసిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఏ పార్టీకైనా మాయని మచ్చే. ఈ విషయంలో టీడీపీ సైతం ఎవరికీ మినహాయింపు ఇవ్వడం లేదు. వైసీపీ హయాంలో బూతులు మాట్లాడిన అనేక నేతలపై కేసులు నమోదు అవుతున్న వేళ, తమ పార్టీ కార్యకర్తపై కూడా అదే స్థాయిలో చర్య తీసుకోవడం చంద్రబాబు పాలిటిక్స్‌లో నైతికతకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో చూపిస్తుంది.

  Last Updated: 10 Apr 2025, 05:08 PM IST