Site icon HashtagU Telugu

CBN JOBs : జాబ్ కావాలంటే బాబు రావాల్సిందే! టీడీపీ హ‌యాంలోని ఉద్యోగాలివి!

CBN JOBs

640px Chandrababu Naidu 2017

నిజం(CBN JOBs) పెద‌విదాటేలోపు అబ‌ద్ధం ఊరంతా చుడుతుందని సామెత‌. ఏపీ రాజ‌కీయాల‌కు ఈసామెత అచ్చుగుద్దిన‌ట్టు స‌రిపోతోంది. విడిపోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు తొలి సీఎంగా(Chief Minister) బాధ్య‌త‌లు స్వీక‌రించిన చంద్ర‌బాబునాయుడు ఆ రాష్ట్ర అభివృద్ధి గురించి తపించారు. విజ‌న్ 2029, విజ‌న్ 2050 దిశ‌గా రాష్ట్రాన్ని ప‌రుగులు పెట్టించాల‌ని భావించారు. అందుకోసం పునాదులు వేస్తూ యువ‌త‌ను ఉపాథి క‌ల్పిస్తూ వెళ్లారు. విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేసిన పారిశ్రామిక స‌ద‌స్సుల్లో సుమారు 25ల‌క్ష‌ల కోట్ల విలువైన ఒప్పందాల‌ను చేసుకున్నారు. వాటిలో కొన్ని కార్యరూపం దాల్చాయి. మ‌రికొన్ని వ‌చ్చేలోపు చంద్ర‌బాబు అధికారాన్ని కోల్పోయారు.

2014 నుంచి 2019 వ‌ర‌కు చంద్ర‌బాబు (CBN JOBs)

2014 నుంచి 2019 వ‌ర‌కు చంద్ర‌బాబు(Chief Minister) హ‌యాంలో వ‌చ్చిన పెట్టుబ‌డులు తెలంగాణ సీఎం కేసీఆర్ కు బాగా తెలుసు. ఎందుకంటే, తెలంగాణ‌కు వ‌చ్చిన కొన్ని కంపెనీలు రాత్రికి రాత్రి మ‌న‌సు మార్చుకుని ఏపీ వైపు వెళ్లాయి. వాటిలో కియా మోటార్స్, ఆపిల్ వంటి కంపెనీలు ఉన్నాయి. కొన్ని ఏపీలో లాంచ్ కాగా మ‌రికొన్ని చంద్ర‌బాబు సీఎం ప‌ద‌వి కోల్పోయిన త‌రువాత అటువైపు చూడ‌కుండా వెళ్లాయి. అప్పుడు వ‌చ్చిన లులూ లాంటి కంపెనీలు కూడా ఇప్పుడు దుకాణం స‌ర్దుకున్నాయి. ఇదంతా నిజం. అయితే, చంద్ర‌బాబు హ‌యాంలో  నిరుద్యోగం పెరిగింద‌ని, ఆయ‌న ప‌రిపాల‌న అంతా అవినీతి మ‌యమ‌ని, సొంత సామాజిక‌వ‌ర్గానికి దోచిపెట్టార‌ని అబద్దాల‌ను ప్ర‌త్య‌ర్థులు ఊద‌ర‌గొట్టారు. దాన్ని ప్ర‌జ‌లు న‌మ్మారు. ఫ‌లితం ఇప్పుడు ఏపీలో క‌నిపిస్తోంది.

Also Read : CBN Giotag : జ‌గ‌న్ ఎత్తుగ‌డ‌కు టెక్నాల‌జీతో చెక్ పెట్టేలా చంద్ర‌బాబు చ‌తుర‌త‌

అప్ప‌ట్లో చంద్ర‌బాబునాయుడు ఇమేజ్ (CBN JOBs) తో ఏపీకి వ‌చ్చిన  కంపెనీల జాబితా, వాటి ద్వారా ఉపాథి పొందిన ఉద్యోగుల సంఖ్య ఎంత‌? అనేది ఎవ‌రైనా చెక్ చేసుకోచ్చు. వాటి వివ‌రాల‌ను తెలుగుదేశం పార్టీ సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేసింది. ఇవి కాకుండా ప‌రోక్షంగా వ‌చ్చిన ఉద్యోగాలు చాలా ఉన్నాయ‌ని టీడీపీ చెబుతోంది. ఆయా కంపెనీలు, ఉద్యోగుల సంఖ్య ఈ విధంగా ఉంది.

చంద్ర‌బాబునాయుడు ఇమేజ్ తో ఏపీకి వ‌చ్చిన కంపెనీల జాబితా (Chief Minister)

*ఇసుజు – చిత్తూరు – 3000 కోట్లు – 3000 ఉద్యోగాలు.

*హీరో మోటో కార్ప్ – చిత్తూరు – 1600 కోట్లు – 5000 ఉద్యోగాలు.

*భారత్ ఫోర్జ్ యూనిట్ – నెల్లూరు – 1200 కోట్లు – 3000 ఉద్యోగాలు.

*కళ్యాణి స్టీల్ – అనంతపురం – 1000 కోట్లు – 2000 ఉద్యోగాలు.

*అశోక్ లేలాండ్ – మల్లవల్లి, క్రిష్ణ – 1000 కోట్లు – 1500 ఉద్యోగాలు.

*బ్రేక్స్ ఇండియా (TVS) – నెల్లూరు – 150 కోట్లు – 600 ఉద్యోగాలు

*KIA మోటార్స్ – అనంతపురం – 7000 కోట్లు – 13000 ఉద్యోగాలు.

🔸ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్….(CBN JOBs)

*విటాల్ ఇన్నోవేషన్ – లేపాక్షి – 5000 కోట్లు – 5000 ఉద్యోగాలు.

*ఎస్సెల్ ఇన్ఫ్రా – చిత్తూరు – 3000 కోట్లు – 2000 ఉద్యోగాలు.

*ఎస్సెల్ ఇన్ఫ్రా – విశాఖపట్నం – 10000 కోట్లు – 15000 ఉద్యోగాలు.

*భారత్ ఎలక్ట్రానిక్స్ – అనంతపురం – 500 కోట్లు – 300 ఉద్యోగాలు

*భారత్ ఎలెక్ట్రానిక్స్ లిమిటెడ్ – కృష్ణ – 300 కోట్లు – 200 ఉద్యోగాలు.

🔸రక్షణ :-

DRDO యూనిట్ – కర్నూలు – 1000 కోట్లు – 3000 ఉద్యోగాలు

🔸ఎనర్జి :-

*టర్బైన్లు – నెల్లూరు – 1000 కోట్లు – 1000 ఉద్యోగాలు.

*హారోన్ – విశాఖపట్నం – 1188 కోట్లు – 1200 ఉద్యోగాలు.

*సోలార్రెన్యూ – కర్నూలు – 150 కోట్లు – 100 ఉద్యోగాలు

*లాంగి – సోలార్ సెల్స్, చిత్తూరు – 1500 కోట్లు – 1000 ఉద్యోగాలు

*ట్రినిసౌర – విశాఖ – 2800 కోట్లు – 3500 ఉద్యోగాలు

*పెట్రోనెట్ LNG లిమిటెడ్ – 4500 కోట్లు – 5000 ఉద్యోగాలు

*కోక్ పవర్లిమిటెడ్ – నెల్లూరు – 725 కోట్లు – 1525 ఉద్యోగాలు.

🔸పెయింట్స్:

*బర్జర్ – అనంతపురం – 500 కోట్లు – 750 ఉద్యోగాలు.

*ఆసియా పెయింట్స్ – వైజాగ్ – 1818 కోట్లు – 2000 ఉద్యోగాలు.

*బ్రిటిష్ పెయింట్స్ – హిందూపూర్ – 700 కోట్లు – 750 ఉద్యోగాలు.

🔸ఫార్మా:

*ఫైజర్ / హాస్పిరా – విశాఖపట్నం – 2500 కోట్లు – 1500 ఉద్యోగాలు.

*అరబిందో – నెల్లూరు 300 కోట్లు – 1000 ఉద్యోగాలు.

*రెడ్డిస్ – విశాఖపట్నం – 500 కోట్లు – 1500 ఉద్యోగాలు.

*డివిస్ ల్యాబ్స్ – కాకినాడ – 500 కోట్లు – 1000 ఉద్యోగాలు.

🔸 ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు:

*జై రాజ్ ఇస్పాత్ – కర్నూలు – 3000 కోట్లు – 1000 ఉద్యోగాలు.

*రెడ్ కొన్ ట్యూబ్స్ – నెల్లూరు – 508 కోట్లు – 500 ఉద్యోగాలు.

*అల్ట్రాటెక్ – గుంటూరు, కర్నూలు – 1500 కోట్లు – 2500 ఉద్యోగాలు.

*రామ్కో సిమెంట్ – కర్నూలు – 350 కోట్లు – 500 ఉద్యోగాలు.

*ఆమోద్ ట్రైమెక్స్ – భావనపాడు – 2500 కోట్లు – 5000 ఉద్యోగాలు.

*చెట్టినాడ్ సిమెంట్ – గుంటూరు – 1100 కోట్లు – 1000 ఉద్యోగాలు

*ప్లోరా సెరామిక్స్ – నెల్లూరు – 60 కోట్లు – 250 ఉద్యోగాలు.

🔸కెమికల్స్ :-

*శాంతిరామ్ కెమికల్స్ – కర్నూలు – 900 కోట్లు – 650 ఉద్యోగాలు.

*డెక్కన్ కెమికల్స్ – విశాఖపట్నం – 1000 కోట్లు – 400 ఉద్యోగాలు

🔸ఫుడ్స్ అండ్ ప్రోసెసింగ్ యూనిట్:-

*మోంటాలెజ్ – చిత్తూరు – 1250 కోట్లు – 1600 ఉద్యోగాలు.

*కోకా-కోలా – విశాఖపట్నం – 1375 కోట్లు – 3645 ఉద్యోగాలు.

*బ్రిటానియా – చిత్తూరు – 150 కోట్లు – 100 ఉద్యోగాలు.

*కెల్లోగ్స్ – చిత్తూరు – 350 కోట్లు – 300 ఉద్యోగాలు

*పెప్సి – చిత్తూరు – 760 కోట్లు – 350 ఉద్యోగాలు

*గోద్రేజ్ ఆగ్రోవెట్ – చిత్తూరు – 250 కోట్లు – 240 ఉద్యోగాలు

*అంబుజా ఎక్స్పోర్ట్ – కర్నూలు -250 కోట్లు -500 ఉద్యోగాలు

*జైన్ ఇరిగేషన్ – కర్నూలు – 600 కోట్లు – 500 ఉద్యోగాలు

*పెన్వర్ ప్రొడక్ట్స్ – నెల్లూరు – 1500 కోట్లు – 2500 ఉద్యోగాలు.

🔸మినరల్స్

*MPL స్టీల్ – కర్నూలు – 1000 కోట్లు – 800 ఉద్యోగాలు.

*వెల్స్పన్ రెన్యువబుల్స్ – కర్నూలు – 120 కోట్లు – 100 ఉద్యోగాలు.

🔸టెక్స్టైల్స్

*మోహన్ స్పిన్క్స్ – కృష్ణ – 289 కోట్లు – 150 ఉద్యోగాలు.

*KGI ట్రౌజర్స్ – చిత్తూరు,నెల్లూరు – 75 కోట్లు – 100 ఉద్యోగాలు

*షాహి గ్రూప్ గార్మెంట్స్ – చిత్తూరు – 145 కోట్లు – 3000 ఉద్యోగాలు.

*SAR డెనిమ్ – అనంతపురం – 80 కోట్లు – 1500 ఉద్యోగాలు.

*నిషా డిజైన్ – అనంతపురం – 96 కోట్లు – 1600 ఉద్యోగాలు.

*తారకేశ్వర వస్త్రాలు – నెల్లూరు – 400 కోట్లు – 950 ఉద్యోగాలు.

🔸మొబైల్ & హ్యాండ్సెట్ మరియు ఎలక్ట్రానిక్స్

*ఫాక్స్కాన్,జియోమి – చిత్తూరు – 1200 కోట్లు – 6000 ఉద్యోగాలు

*సెల్కన్ – చిత్తూరు – 100 కోట్లు – 2500 ఉద్యోగాలు.

*మైక్రోమ్యాక్స్ – చిత్తూరు – 100 కోట్లు – 2500 ఉద్యోగాలు.

*కార్బన్ – చిత్తూరు – 200 కోట్లు – 2000 ఉద్యోగాలు.

*లావా మొబైల్స్ – చిత్తూరు – 500 కోట్లు – 3000 ఉద్యోగాలు.

🔸పారిశ్రామిక యూనిట్లు, ఉపకరణాలు, భాగాలు (CBN JOBs)

*థర్మాక్స్ – చిత్తూరు – 150 కోట్లు – 1000 ఉద్యోగాలు.

Also Read : CBN-PM : మోడీ విజ‌న్ 2040కి చంద్ర‌బాబు స‌హ‌కారం! PMO నుంచి సంకేతాలు!