CBN IT Issue : చంద్ర‌బాబు అరెస్ట్ సాధ్య‌మా?

CBN IT Issue : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబును అరెస్ట్ చేయ‌బోతున్నార‌ని వైసీపీ సోష‌ల్ మీడియా ఊద‌ర‌కొడుతోంది.

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 02:49 PM IST

CBN IT Issue : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబును అరెస్ట్ చేయ‌బోతున్నార‌ని వైసీపీ సోష‌ల్ మీడియా ఊద‌ర‌కొడుతోంది. ఆయ‌న సీఎంగా ఉన్న‌ప్పుడు 118 కోట్ల రూపాయ‌లు వివిధ కాంట్రాక్టు సంస్థ‌ల నుంచి తీసుకున్నార‌ని ఐటీ మోపిన అభియాగం. దాన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేస్తార‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్ భావిస్తోంది. అదే అభిప్రాయాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ ల‌ను పెడుతోంది. నిజంగా అరెస్ట్ చేసే అవ‌కాశం ఉందా? అస‌లు ఆ రూ. 118 కోట్ల వ్య‌వ‌హారం ఏమిటి? అనేది చ‌ర్చ‌కు దారితీసింది.

ఐటీ మోపిన రూ. 118 కోట్ల వ్య‌వ‌హారంఅభియాగం (CBN IT Issue)

ఏపీ సీఎంగా చంద్ర‌బాబు 2014 నుంచి 2019 వ‌ర‌కు ఉన్నారు. ఆ స‌మ‌యంలో వివిధ సంస్థ‌ల‌కు కాంట్రాక్టుల‌ను ఇచ్చారు. అందుకు ప్ర‌తిగా క్విడ్ ప్రో కో కింద ముడుపులు ఇచ్చార‌ని ఐటీ శాఖ (CBN IT Issue) భావిస్తోంది. లెక్క చూప‌ని రూ. 118 కోట్లు అలా వ‌చ్చినవేన‌ని అనుమానిస్తోంది. అందుకు  ఆధారంగా ఒక కంపెనీ ఓన‌ర్ ఇచ్చిన వాగ్మూలం ఉంద‌ట‌. అలాగే, చంద్ర‌బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ సంత‌కం పెట్టిన మ‌రో వాగ్మూలం చూపిస్తున్నారు. కానీ, ఐటీ అధికారులు భ‌య‌పెట్టి వాగ్మూలం మీద సంత‌కాలు చేయించుకున్నార‌ని న్యాయ‌స్థానం ఎందుట వాళ్లు చెప్పారు. ఆ విష‌యాన్ని మ‌రిచిపోయిన వైసీపీ సోష ల్ మీడియా చంద్ర‌బాబు అరెస్ట్ ఖాయ‌మంటూ ప్ర‌చారం చేస్తోంది.

మాజీ పీఎస్ శ్రీనివాస్ సంత‌కం పెట్టిన మ‌రో వాగ్మూలం

ఆదాయ‌పు ప‌న్నుల‌శాఖ ఇచ్చిన నోటీసుల ప్ర‌కారం చంద్ర‌బాబు కుటుంబీకులు 118 కోట్ల రూపాయాల‌కు ప‌న్ను చెల్లించ‌లేదు. లెక్క‌చూప‌ని మొత్తంగా దాన్ని తేల్చారు. ఆ మేర‌కు నోటీసులు ఇచ్చారు. ఇలా నోటీసులు ఇవ్వ‌డం స‌ర్వ‌సాధారణంగా ఎవ‌రి విష‌యంలోనైనా ఐటీ శాఖ చేస్తోంది. కానీ, ఏదో కొత్త‌గా చంద్ర‌బాబుకు మాత్ర‌మే నోటీసులు (CBN IT Issue) ఇచ్చిన‌ట్టు వైసీపీ చెబుతోంది. అంతేకాదు, లోకేష్ కు కూడా నోటీసులు వెళ్లాల‌ని స‌రికొత్త ప్ర‌చారం వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మొద‌లు పెట్టారు. ఐటీ శాఖ మోపిన అభియోగాల‌పై స‌హ‌జంగా చంద్ర‌బాబు తిరుగు స‌మాధానం ఇస్తారు. ఒక వేళ దానికి సంతృప్తి చెందిక పోతే, ఆ మొత్తానికి అప‌రాధ రుసుంను చెల్లించాల‌ని ఐటీశాఖ కోరుతుంది. ఆ మొత్తాన్ని చంద్ర‌బాబు చెల్లిస్తారు. అంతేగానీ, ఆయ‌న్ను అరెస్ట్ చేసి, బీడీలు వేసి తీసుకెళ్లదు.

Aslo Read : CBN Social Media : పొత్తు కోసం చంద్ర‌బాబుపై ఐటీ ప్ర‌యోగం?

గ‌త రెండు రోజులు వైసీపీ సోష‌ల్ మీడియా, ఆ పార్టీ నేత‌లు మాత్రం చంద్ర‌బాబు అరెస్ట్ త‌థ్య‌మంటూ హోరెత్తిస్తున్నారు. ఐటీశాఖ అభియోగం మోపిన రూ. 118 కోట్లు మాత్ర‌మే కాదు, అమ‌రావ‌తి కేంద్రంగా రూ. 40వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగింద‌ని యాడ్ చేసింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయ‌ని చెబుతోంది. అసైన్డ్ ల్యాండ్స్, ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్, రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌, సింగపూర్ క‌న్సార్టియంతో ఒప్పందం త‌దిత‌ర రూపాల్లో రూ. 40వేల కోట్లు కుంభ‌కోణం జ‌రిగింద‌ని ఆరోపిస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు ఐటీశాఖ వ‌ద్ద ఉన్నాయ‌ని చెబుతున్నారు. వాటి తాలూకూ నోటీసులు  (CBN IT Issue) కూడా త్వ‌ర‌లోనే చంద్ర‌బాబుకు వ‌స్తాయ‌ని ఊద‌ర‌కొడుతోంది.

Also Read : CBN Plan 45 : భ‌విష్య‌త్ కు 45 రోజుల ప్రణాళిక‌, చంద్ర‌బాబు దూకుడు

ప్ర‌స్తుతం వైసీపీ చేస్తోన్న ఆరోప‌ణ‌ల‌పై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ మూడేళ్ల క్రితం విచార‌ణ చేప‌ట్టింది. ఏపీ సీఐడీ, ఏసీబీ ప‌లు ర‌కాల విచార‌ణ‌లు చేసింది. ఒక్క‌దాన్ని కూడా నిరూపించ‌లేక‌పోయింది. ప్ర‌భుత్వంలో ఉన్న వాళ్లు ఆరోప‌ణ‌లు చేయ‌డం కాదు, నిరూపించాల‌ని చంద్ర‌బాబు ప‌లుమార్లు స‌వాల్ కూడా చేశారు. ఏనాడూ ఈ నాలుగున్న‌రేళ్ల‌లో నిరూప‌ణ చేసిన ఆరోప‌ణ లేదు. ఇప్పుడు ఐటీశాఖ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని వైసీపీ చెబుతోంది. ద‌ర్యాప్తు సంస్థ వ‌ద్ద‌లేని ఆధారాలు ఐటీశాఖ వ‌ద్ద ఉంటాయా? అంటే వైసీపీ నేత‌ల వ‌ద్ద స‌మాధానం లేదు. అమ‌రావ‌తి రాజ‌ధాని కేంద్రంగా రూ. 40వేల కోట్ల కుంభ‌కోణం జ‌రిగితే రాష్ట్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఎందుకు నిరూపించ‌లేక‌పోయిన‌ట్టు? ఇప్పుడు ఐటీశాఖ నోటీసులు ఇవ్వ‌గానే చంద్ర‌బాబు మీద బుర‌ద‌చ‌ల్ల‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అనేది వైసీపీ నేత‌లు ఆలోచించాలి. .