Site icon HashtagU Telugu

Chandrababu : శిష్యుడి బాటలో గురువు..?

Cbn Follow Revanth

Cbn Follow Revanth

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రీసెంట్ గా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. 164 అసెంబ్లీ , 21 పార్లమెంట్ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నిన్న బుధువారం ప్రధాని మోడీ సమక్షంలో సీఎం గా చంద్రబాబు (Chandrababu) తో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇక ఈరోజు రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో ఉన్న సీఎం ఛాంబర్‌లో ఈ సాయంత్రం 4:41 నిమిషాలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చినట్లుగానే సీఎం హోదాలో మెుదట మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పింఛను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్ సెన్సెస్‌, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకాలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పోతే చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) ని ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం శాఖల వారీగా శ్వేతపత్రాలంటూ హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అమాత్యులతో అన్నారు. శాఖలవారీ శ్వేతపత్రాలు రూపొందించి ప్రజల ముందుంచుదామని, జగన్‌ హయాంలో రివర్స్‌ విధానాలు, అరాచకాల్ని వారికి వివరిద్దామని తెలిపారు.

గత ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పని చేసిన పీఏలను నియమించుకోవద్దని సూచించారు. ముఖ్యంగా ఓఎస్డీలు, పీఏ, పీఎస్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పని చేసిన సిబ్బందిని దరి చేరనివ్వద్దని స్పష్టం చేశారు. తమ పని తీరు ద్వారా మంత్రిత్వ శాఖలకు వన్నె తేవాల్సిన బాధ్యత మంత్రులదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే మాదిరిగా రేవంత్ కూడా అధికారంలోకి రాగానే చేసాడు. గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై బదిలీ వేయడం..పలు మార్పులు చేర్పులు చేయడం చేయడం చేసారు. ఇంకా చేస్తూనే వస్తున్నారు. అలాగే బిఆర్ఎస్ హయాంలో జరిగిన అనేక అవకతవకల ఫై అరా తీస్తూ కేసులు పెడుతున్నారు. ఇక ఇప్పుడు ఏపీలో బాబు సర్కార్ కూడా అదే చేయబోతుంది. ఇప్పటికే పలు శాఖల అధికారులను మార్చడం చేసారు. అంతే కాదు తెలంగాణ లో ఎలాగైతే పాలనా సాగుతుందో..పథకాలు నడుస్తున్నాయో అవి మాదిరి ఏపీలో నడుస్తున్నాయి. మహిళలకు ఫ్రీ బస్సు, పెన్షన్ పెంచడం , మెగా DSC , మద్యం పాలసీలు తీసుకరావడం ఇవ్వన్నీ కూడా చంద్రబాబు అనుసరిస్తున్నాడు. మొత్తం మీద శిష్యుడి బాటలో గురువు ముందుకు వెళ్తున్నాడు.

Read Also : Big Company Invest : తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన బడా కంపెనీ

Exit mobile version