Site icon HashtagU Telugu

Jagan : మహిళల గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు – చంద్రబాబు

Cm Chandrababu

Cm Chandrababu

ఆంధ్రప్రదేశ్‌లో మహిళల సాధికారతకు తెలుగుదేశం పార్టీ (TDP) పాలన మార్గదర్శకంగా నిలుస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో మహిళలను ప్రాధాన్యతగా పరిగణిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. 1986లో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడమే కాకుండా, రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మహిళల ప్రగతికి అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలను ఆర్థికంగా స్వయంసంపూర్ణంగా తీర్చిదిద్దే దిశగా అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Vijayasai Reddy : వాళ్ల వల్లే నాకు, జగన్‌కు విభేదాలు.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ (Jagan) తన తల్లి, చెల్లికి (Sharmila , Vijayamma ) కూడా ఆస్తిలో వాటా ఇవ్వలేకపోయారంటే, అలాంటి వ్యక్తికి మహిళలపై మాట్లాడే హక్కే లేదని సీఎం చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. కుటుంబ సభ్యులకే ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి, రాష్ట్రానికి మహిళా సాధికారతపై ఏ విధంగా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, మహిళలకు విద్య, ఉద్యోగ, ఆస్తి హక్కుల్లో పూర్తి ప్రోత్సాహం అందించాలని చంద్రబాబు తెలిపారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, తాము చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఇప్పుడు మహిళలు వ్యాపార రంగంలో, ఉద్యోగాల్లో ముందుకెళ్తున్నారని ఆయన అన్నారు.

CM Chandrababu : తెలుదేశం పార్టీ.. తెలుగింటి ఆడపడుచుల పార్టీ : సీఎం చంద్రబాబు

అమరావతి రాజధాని కోసం పోరాడిన మహిళల త్యాగాన్ని గుర్తిస్తూ, ప్రభుత్వం వారి భవిష్యత్తును కాపాడేందుకు కట్టుబడి ఉందని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందికి పైగా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో వెయ్యిమంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శాసనసభ్యులు ప్రత్యేకంగా కృషి చేయాలని ఆయన సూచించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు, సమాజంలో వారికి మరింత స్థానం కల్పించేందుకు ప్రభుత్వ విధానాలను మరింత ముందుకు తీసుకెళ్లనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.