Site icon HashtagU Telugu

Nara Bhuvaneswari Birthday : భువనేశ్వరి ప్రేమే మా కుటుంబానికి బలం – చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్

Lokesh Cbn Wishes

Lokesh Cbn Wishes

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) తన సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు(Nara Bhuvaneswari Birthday) సందర్భంగా భావోద్వేగంగా స్పందించారు. ఆమె ప్రేమే తమ కుటుంబానికి బలం, పునాది అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రతి కష్టసుఖాల్లో తనకు తోడుగా నిలిచిన భువనేశ్వరి, తన జీవితానికి వెలుగు అని చంద్రబాబు చెప్పారు. వ్యాపారం, సేవ, దాతృత్వం వంటి రంగాల్లో ఆమె చూపిన నాయకత్వం తమ కుటుంబానికి, పార్టీకి పెద్ద స్ఫూర్తి అని పేర్కొన్నారు. తన ప్రజాసేవ తపనలో ఆమె శాతం సహకరించిందని, చీకటి రోజుల్లోనూ నవ్వుతూ పక్కన నిలిచిందని పేర్కొన్న చంద్రబాబు ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Technical Problem : మరో విమానంలో సాంకేతిక సమస్య..ఈసారి ఎక్కడ..? ఏ విమానానికి అంటే..!!

అలాగే నారా లోకేశ్ తన తల్లి నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా ఎక్స్ వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అమ్మ ప్రేమ, అంకితభావం, ప్రజాసేవ పట్ల ఉన్న తపన తన జీవితానికి మార్గదర్శకమని పేర్కొన్న ఆయన, ప్రతిరోజూ తల్లిని ఆరాధిస్తున్నానని చెప్పారు. ఆమె ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. లోకేశ్‌తో పాటు ఆయన సతీమణి బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్ కూడా భువనేశ్వరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. నందమూరి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Nita Ambani : గొప్ప మనసు చాటుకున్న నీతా అంబానీ..బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి భారీ విరాళం

నారా భువనేశ్వరి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శ్రేణులు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆమె ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వెళ్లి పార్టీకి బలంగా నిలిచిన తీరు పార్టీ విజయానికి కీలకం అయ్యింది. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఆమె నేతృత్వం ప్రజల్లో విశ్వాసాన్ని రేకెత్తించింది. గడప గడపకు తిరిగి టీడీపీపై మద్దతు కూడగట్టడంలో ఆమె పాత్ర పెద్దదే. ఇప్పుడీ పుట్టినరోజును పురస్కరించుకుని కార్యకర్తలు వివిధ నియోజకవర్గాల్లో భారీ కేక్‌లు కట్ చేసి వేడుకలు నిర్వహించారు. భువనేశ్వరి ప్రజల మన్ననలు పొందిన మహిళగా నిలవడమే కాక, కుటుంబానికి, పార్టీకి మానవీయ బలంగా నిలుస్తూ ముందుకు సాగుతున్నారు.