ఏపీ సీఎం జగన్ (YS Jagan) విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 16 నుంచి జూన్ 1 వరకు ఆయన యూరప్ లో ఉండబోతున్నారు. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొద్దీ రోజుల కిందటే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నేపథ్యంలో నాంపల్లి కోర్ట్ ఆయనకు అనుమతి ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ కు 2013లో బెయిల్ ఇచ్చిప్పుడు దేశం విడిచి వెళ్లరాదని సీబీఐ కోర్టు షరతు విధించింది. అప్పటి నుండి ఆయన విదేశాలకు వెళ్లాలని అనుకునప్పుడల్లా కోర్ట్ అనుమతి తీసుకోవాల్సిందే. కోర్ట్ అనుమతి ఇస్తేనే వెళ్ళాలి..ఈ తరుణంలో ఇప్పుడు కూడా అనుమతి ఇవ్వడం తో ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు విదేశాల్లో గడపనున్నారు. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో 17 రోజులు కుటుంబ సభ్యులతో కలిసి రెస్ట్ తీసుకోనున్నారు.
ఏపీ ఎన్నికల నేపథ్యంలో గత మూడు నెలలుగా జగన్ ఏమాత్రం రిస్ట్ లేకుండా గడిపిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల ఎంపిక చేయడం..వారి తరుపు ప్రచారం చేయడం..ప్రతిపక్ష పార్టీల ఫై విరుచుకుపడడం చేస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు ఎన్నికల పోలింగ్ పూర్తి అవ్వడం..ఫలితాలు రావడానికి కూడా ఇంకా చాల రోజుల అసమయమే ఉండడం తో కుటుంబ సభ్యులతో కలిసి కాస్త రిలాక్స్ అవ్వడానికి విదేశాలకు పయనం అవుతున్నారు జగన్.
Read Also : CM Jagan Tweet: ఎన్నికల తర్వాత సీఎం జగన్ ఫస్ట్ ట్వీట్ ఇదే.. ఏమన్నారంటే..?