మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో సరికొత్త ట్విస్ట్ (A New Twist) చోటుచేసుకుంది. వివేకా కుమార్తె సునీత (Sunitha), ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. కేవలం వీరిపైనే కాదు సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
వివేకా పీఏ కృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరిలో పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సమయంలో ఎస్పీ రామ్ సింగ్ వేధించారని, సునీత, రాజశేఖర్ రెడ్డి కూడా సీబీఐ చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరించినట్లు ఆ పిటిషన్లో వివరించారు. ఈ క్రమంలో తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా.. ఫలితం లేదని కృష్ణారెడ్డి ఆరోపించారు. అ పిటిషన్పై విచారణ చేపట్టిన పులివెందుల కోర్టు తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో ముగ్గురిపై సెక్షన్ 156 (3) ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.
Read Also : BRS : బిఆర్ఎస్ లో మొదలైన రాజీనామాలు..