ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. “రప్పా.. రప్పా.. వేసేస్తాం.. అంతు చూస్తాం..” (Rappa Rappa Comments) అంటూ వైసీపీ కార్యకర్తల ఆగ్రహపు వ్యాఖ్యలను ప్రోత్సహించేలా నాని మాటలాడారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఓటమి తర్వాత వాపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు కొత్తగా రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లెక్సీలు, ప్లకార్డులు, నినాదాలతో జగన్ 2.0 అంటూ వైసీపీ శ్రేణులు ప్రత్యర్థులపై తూటాలు పేల్చేలా వ్యవహరిస్తున్నట్టు ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి.
Sreeleela : శ్రీలీల కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ కావాలెప్పుడో..!
పేర్ని నాని వ్యాఖ్యలు కొట్టిపారేయలేనివిగా మారాయి. ఆయన “చీకట్లో కన్ను కొడితే జరిగిపోవాల్సిన పనులు పట్టపగలు మాట్లాడుకుంటామా?” అన్న వ్యాఖ్య తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ మాటల వెనుక దాగిన ఉద్దేశ్యం ఏమిటన్న ప్రశ్నలు చుట్టుముట్టాయి. “రప్పా రప్పా అనొద్దు, కానీ చాటుగా చేసేయండి” అన్న సూచనలా నానిని ఆరోపిస్తున్నారు ప్రత్యర్థులు. టీడీపీ శ్రేణులు ఈ మాటలను హత్యా రాజకీయాలకు ప్రోత్సాహమని, చట్టవ్యతిరేకంగా వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టే కుట్రగా అభివర్ణిస్తున్నాయి.
ఇక రెడ్‌బుక్‌పై టీడీపీ ఆరోపణలను వ్యంగ్యంగా కొట్టిపారేస్తూ పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు మరింత వివాదస్పదంగా మారాయి. “అరిచే కుక్క కరవదు.. కరిచే కుక్క అరవదు” అన్న వ్యాఖ్యతో పాటు, “మనవాళ్లు రప్పా.. రప్పా అంటున్నారు.. జగన్ 2.0లో మిత్తితో సహా చెల్లిస్తాం” అన్న మాటలు కార్యకర్తలను రెచ్చగొట్టేలా ఉన్నాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అధికార పార్టీకి తిరిగి వచ్చిన మద్దతుతో వైసీపీ నేతలు అదుపు తప్పినట్టు ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
Term Insurance : ప్రమాద సమయంలో కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వాలంటే.. టర్మ్ ఇన్షూరెన్స్ తప్పనిసరి..!
ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. నాని వ్యాఖ్యలు హింసకు ప్రేరేపించేవిగా ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారం పట్ల అధికార కూటమి ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.