Perni Nani : పేర్ని నానిఫై కేసు నమోదు

ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో టీడీపీ - వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. టీడీపీ సానుభూతిపరులైన కేశన ధర్మతేజ, కేశన మహేష్​లపై 50వ డివిజన్​కు చెందిన వైసీపీ కార్యకర్తలు కొందరు దాడి చేశారు

Published By: HashtagU Telugu Desk
Case File On Perninani

Case File On Perninani

వైసీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఫై చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌ (Chilakalapudi Police Station)లో కేసు నమోదు అయ్యింది. రెండు రోజుల క్రితం ఉల్లిపాలెం నూకాలమ్మ తల్లి జాతరలో టీడీపీ – వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. టీడీపీ సానుభూతిపరులైన కేశన ధర్మతేజ, కేశన మహేష్​లపై 50వ డివిజన్​కు చెందిన వైసీపీ కార్యకర్తలు కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ కార్యకర్తల పై కేసు పెట్టారు. అయితే తమ కార్యక్రమతలపై కేసు పెడతారా అంటూ పేర్ని నాని పోలీస్ స్టేషన్ కు వచ్చిన నానా హంగామా చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

పోలీస్ స్టేషన్ లో ఉన్న ఫర్నిచర్ ధ్వసం చేయడం తో పాటు పలు ఫైల్స్ విసిరిగొట్టడం , స్టేషన్ లో ఉన్న సీసీ కెమెరాలను పగలగొట్టడం చేసారు. ఈ ఘటన ఫై పోలీసులు పేర్ని నాని తో పాటు ఆయన అనుచరులపై ఐపీసీ 188, 143, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ పైనే దాడి చేసిన ఘటన కావడంతో .. పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇలా చేయండ పోలీసు విధులకు ఆటంకం కలిగించడమేనని భావిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసినందున.. తదుపరి చర్యలు తీసుకునేదిశగా ఆలోచిస్తున్నారు.

Read Also : MLC Iqbal Joins TDP : టీడీపీ లో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ

  Last Updated: 10 Apr 2024, 05:03 PM IST