వైసీపీ మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలకు వరుస షాకులు ఎదురువుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో తమదే రాజ్యం అంటూ ఇష్టారీతిగా వ్యహరించారు..ఎవరు ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయడం , కేసులు పెట్టడం , బెదిరించడం వంటివి చేసారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి వారికీ చుక్కలు కనిపిస్తున్నాయి. అక్రమంగా దోచిన సొమ్మును కక్కించే పనిలో పడింది కూటమి సర్కార్. అంతే కాదు గతంలో చేసిన వాటికీ కేసులు పెట్టడం చేస్తున్నారు. తాజాగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) ఫై కేసు నమోదైంది.
We’re now on WhatsApp. Click to Join.
తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ గుడివాడ ఆటోనగర్ వాసి దుగ్గిరాల ప్రభాకర్ (Duggirala Prabhakar) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండి వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతా రెడ్డిలపై 448,427,506 ఆర్ అండ్ డబ్ల్యూ 34 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. తమ గోదాములో ఉన్న లిక్కర్ కేసులను పగలకొట్టి తగలబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నాడు ప్రభాకర్. తమ బాధ చెబితే వాసుదేవరెడ్డి, మాధవీలత దూషించారని, ఈ బాధ తట్టుకోలేక కొద్ది రోజులకే తన తల్లి మనస్తాపంతో మరణించిందని ప్రభాకర్ తెలిపాడు.
Read Also : Bonalu 2024 : హైదరాబాద్ లో మొదలైన బోనాల సందడి..రేపు గోల్కొండ బోనాల జాతర