Vijaysai Vs Buddha : సీఎం చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవలే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సీరియస్ అయ్యారు. ఈ అంశంపై ఆయన విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబుకు కంప్లయింట్ ఇచ్చారు.సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సీపీని బుద్ధా వెంకన్న కోరారు.
Also Read :Syria Rebels : ‘‘సిరియాలో ఇక కొత్త శకం.. చీకటి కాలాన్ని ముగించాం’’ : సిరియన్ రెబల్స్
సీపీకి కంప్లయింట్ ఇచ్చిన అనంతరం విలేకరులతో బుద్ధా వెంకన్న మాట్లాడారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని విజయసాయిరెడ్డికి ఆయన వార్నింగ్ ఇచ్చారు. కాకినాడ పోర్టును బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఆస్తులను ఎవరూ అమ్ముకోరని తెలిపారు. మరి కేవీ రావు దగ్గర ఎలా తీసుకున్నారో చెప్పగలరా అని ప్రశ్నించారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్సార్ సీపీ నేతలు చేసిన దారుణాలు అన్నీఇన్నీ కావని వెంకన్న ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఎంతోమంది బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులు, కలెక్టర్లకు కంప్లయింట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు.
Also Read :Strange Marriage Custom : వరుడు యువతిలా.. వధువు యువకుడిలా మారిపోతారు.. వెరైటీ పెళ్లి సంప్రదాయం
‘‘కేవీ రావు కూడా ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కులాన్ని అంటగడతారా’’ అని వెంకన్న(Vijaysai Vs Buddha) ప్రశ్నించారు. ‘‘జగన్ తప్పు చేయలేదని.. ఆస్తులు లాక్కోలేదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా’’ అని అడిగారు. ‘‘వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, పాపాలను ఎత్తి చూపితే, కులం పేరుతో కుట్రలు చేస్తారా’’ అని ఆయన ప్రశ్నించారు. ‘‘విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఆయనలోని ఉన్మాదానికి పరాకాష్ఠ. ఆయనను అరెస్ట్ చేయాలి’’ అని వెంకన్న డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసులు తమ ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు.