Site icon HashtagU Telugu

VIjayasai : విజయసాయి ప్రశ్నకు వైసీపీ సమాధానం చెప్పగలదా..?

Vijayasai Reddy attends CID inquiry

Vijayasai Reddy attends CID inquiry

వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. లిక్కర్ స్కాం (Liquor scam) వ్యవహారంపై ఆయన స్పష్టంగా స్పందిస్తూ, “ఏ స్కాంలేని చోట నేను ఏమి చెబతాను?” అంటూ వైసీపీ నేతలకే ప్రశ్నల వర్షం కురిపించారు. తనను టీడీపీ నేతలతో చేతులు కలిపినట్టు చూపుతూ ప్రచారం చేయడాన్ని ఖండించిన ఆయన, తాను టీడీ జనార్దన్‌ను కలవాలనుకోలేదని, వారి భేటీ యాధృచ్ఛికమని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు, లోకేష్‌ లాంటి నేతల్ని కలవాలనుకుంటే నేరుగా కలుస్తానని స్పష్టం చేశారు.

Mahanadu 2025 : అదిరిన మహానాడు భోజనం మెనూ..భోజన ప్రియులకు పండగే !!

వైసీపీ కోటరీ తనపై కుట్రలు చేస్తోందని విజయసాయి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గతంలో జగన్ కోసం తానే స్వయంగా 21 కేసులు భరించానని గుర్తు చేస్తూ, ఇప్పుడు మాత్రం తనపై బాధ్యతలేని కేసులు మోపడానికి కుట్రలు జరుగుతున్నాయన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న తనను తప్పుగా చిత్రీకరించడానికి యత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. జగన్ రెడ్డి కోసమే గతంలో కేసుల్ని తన మీద వేసుకున్నానని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. కోటరీ ఇప్పటికీ తనపై కుట్రలు చేస్తోందన్నట్లుగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. తాను ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లానని అక్కడకు టీడీ జనార్ధన్ వస్తారని తనకు తెలియదన్నారు. తమ మధ్య ఏ చర్చలూ జరగలేదని.. స్పష్టం చేశారు. తాను కలవాలనుకుంటే నేరుగా చంద్రబాబు, లోకేష్ ను కలుస్తాను కానీ మధ్యలోని వ్యక్తులతో ఎందుకు కలుస్తానని ప్రశ్నించారు.

తాను టీడీపీకి అమ్ముడుపోయానంటూ చేస్తున్న ప్రచారం చివరికి జగన్‌కే సమస్యలు తెస్తుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. మొత్తంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో అంతర్గత వైషమ్యాలను బహిర్గతం చేస్తూ, భవిష్యత్తులో పార్టీకి మేలుకాల చూపిస్తున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.