ఏపీలో కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం

NTR Bharosa Pension  ఏపీలో కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ముఖ్యమైన గమనిక. సోషల్ మీడియా వేదికగా కొత్త పింఛన్ల కోసం అప్లికేషన్ల పేరుతో ప్రచారం జరుగుతోంది. ఓ అప్లికేషన్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఆప్షన్ అందుబాటులోకి రాలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచిస్తున్నారు. కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు […]

Published By: HashtagU Telugu Desk
Ntr Bharosa Pension Scheme

Ntr Bharosa Pension Scheme

NTR Bharosa Pension  ఏపీలో కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ముఖ్యమైన గమనిక. సోషల్ మీడియా వేదికగా కొత్త పింఛన్ల కోసం అప్లికేషన్ల పేరుతో ప్రచారం జరుగుతోంది. ఓ అప్లికేషన్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఆప్షన్ అందుబాటులోకి రాలేదన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచిస్తున్నారు.

  • కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం
  • తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని సూచిస్తున్నారు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అప్లికేష్ ఫేక్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. త్వరలోనే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే కొత్తxe పింఛన్లు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందించామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటామని కూడా చెప్పారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో.. ఏపీలో కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఏకంగ ఓ అప్లికేషన్ ఫామ్‌ను కూడా వైరల్ చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా కొత్త పింఛన్ల దరఖాస్తులపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదంటున్నారు. ప్రస్తుతం స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు సచివాలయాల్లోకొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసే ఆప్షన్ ఇంకా రాలేదు అంటున్నారు. సోషల్ మీడియాలో పింఛన్ల అప్లికేషన్ల పేరుతో ఫేక్‌‌న్యూస్ ప్రచారం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌తో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అయితే ఇప్పటికే పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే.. వారి భార్యలకు వితంతు పింఛన్ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఆ ఆప్షన్ అందుబాటులో ఉందంటున్నారు. కొత్త పింఛన్లకు సంబంధించిన దరఖాస్తులపై సమాచారం వచ్చిన వెంటనే తెలియజేస్తాము అంటున్నారు. తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దంటున్నారు. ఒకవేళ ఏదైనా సమాచారం ఉంటే ప్రభుత్వమే అధికారికంగా ప్రకటిస్తుంది అంటున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అవుతోంది. అయితే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అనర్హుల్ని గుర్తించే ప్రక్రియ చేపట్టింది.. అనర్హుల లెక్క తెలితే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తుల్ని స్వీకరించే అవకాశం ఉంటున్నారు. అలాగే కొత్త పింఛన్లకు సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే ప్రభుత్వం సిద్ధం చేసింది. త్వరలోనే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది.

 

  Last Updated: 23 Feb 2026, 10:25 AM IST