జనసేన ఆవిర్భావ సభ(Janasena Formation )లో ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Speech) చేసిన ప్రసంగంపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు(BV Raghavulu) స్పందించారు. పవన్ ప్రసంగాన్ని విచిత్రంగా అభివర్ణించిన రాఘవులు, గతంలో చేగువేరా పేరు చెప్పి ఓట్లు వేయించుకున్న పవన్, ఇప్పుడు ఆయనను “డాక్టర్” అంటూ చెప్పడం అవాస్తవమని వ్యాఖ్యానించారు. చేగువేరా గొప్ప వ్యక్తి అని అనుకోవడంలో తప్పు లేదని, కానీ పవన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడడం సమంజసం కాదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మోసపూరితమని రాఘవులు ఆరోపించారు. కానీ చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆ ప్యాకేజీని గొప్పగా ప్రశంసించడం ప్రజలను మభ్యపెట్టడం మాత్రమేనని అన్నారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, కార్మికులకు మద్దతుగా నిలబడాలని కోరారు.
Sri Sathyasai District : హోలీ పేరుతో అమ్మాయిలతో ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన
రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అంశంపై సరైన శ్రద్ధ పెట్టడం లేదని, మిట్టల్ స్టీల్ కంపెనీకి సొంత గనులు ఇచ్చినా, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు ఇవ్వకూడదని రాఘవులు ప్రశ్నించారు. కార్మికుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన విధానం రూపొందించాలని, కాకపోతే కార్మికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్టీల్ ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపించాలని డిమాండ్ చేస్తూనే, జనసేన, టీడీపీ విధానాలపై విమర్శలు కొనసాగించారు.