Bus Fire : ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. నిన్న తిరుమలలో రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. వాహనం ఒత్తిడికి గురి అయ్యి టైర్లు స్కిడ్ అయ్యాయి. దీంతో వెహికల్ ఒకపక్కకు ఓరిగింది.. దీని వల్ల బస్సు రోడ్డుకు అడ్డంగా ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. బస్సులో ప్రయాణిస్తున్న 9 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. అయితే.. తాజాగా నంద్యాల జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు రన్నింగ్‌లో ఉన్న సమయంలో పెద్ద ప్రమాదం తప్పింది. తిరువనంతపురం నుండి హైదరాబాద్‌కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చాపిరేవుల టోల్ గేట్ వద్ద ప్రమాదానికి గురైంది. బస్సు టైర్ పేలడంతో పాటు, రాపిడితో మంటలు చెలరేగి బస్సుకు పూర్తిగా మంటలు అంటుకున్నాయి.
South African Gold Mine: దక్షిణాఫ్రికాలో తీవ్ర విషాదం.. 100 మంది మృతి
ఈ ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 నుండి 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే, టోల్‌గేట్ సిబ్బంది జాగ్రత్తగా స్పందించి, డ్రైవర్‌కు టైర్ నుండి మంటలు , వాసన వస్తుందని తక్షణమే సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను అలర్ట్ చేస్తూ, అత్యవసర ద్వారాల అద్దాలను పగులగొట్టి వారిని సురక్షితంగా బస్సు నుండి దించడానికి సహకరించాడు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. బస్సు పాక్షికంగా కాలిపోయినప్పటికీ, ప్రయాణికులెవరూ గాయపడకుండా బయటపడగలగడం గమనార్హం.
ప్రత్యక్షసాక్షులు ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ, టైర్ బ్లాస్ట్ అయిన వెంటనే మంటలు చెలరేగాయని, డ్రైవర్ సమయస్ఫూర్తి కారణంగా పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ ఘటన పండుగ రోజుల్లో జరగడంతో, ప్రయాణికుల భయానక అనుభవం కాగానే ముగిసింది. టోల్‌గేట్ సిబ్బంది, డ్రైవర్ సకాలంలో స్పందించడం వల్ల, భారీ ప్రాణనష్టం తప్పినట్టయింది.
Cockfights Race : బరి.. హోరాహోరీ.. ఏపీలో ఒక్కరోజే రూ.330 కోట్ల కోడిపందేలు