Site icon HashtagU Telugu

Bunny Vas: జనసేన ప్రచార విభాగం చైర్మన్ గా నిర్మాత బన్నీ వాస్..!

Bunny Vas

New Project 14 5

Bunny Vas: జనసేన పార్టీలో బన్నీ వాస్‌ (Bunny Vas)కు కీలక బాధ్యతలు అప్పగించారు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ప్రచార విభాగం చైర్మన్‌గా నిర్మాత బన్నీ వాస్ నియమితులయ్యారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నిర్మాత బన్నీ వాస్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ప్రచార విభాగాన్ని సమన్వయంతో ముందుకు నడిపించాలని బన్నీ వాస్ కు పవన్ కళ్యాణ్ సూచించారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి దృఢంగా తీసుకెళ్లాలని, రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు వినూత్న కార్యక్రమాలను రూపొందించాలన్నారు. పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బన్నీ వాస్‌కు జనసేన పార్టీ ముఖ్యమైన బాధ్యతలు అప్పగించినందుకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: Weather Today : బలంగా తుఫాను.. ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్

బన్నీ వాస్ చాలా కాలంగా జనసేన పార్టీ కోసం రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. చివరగా పవన్ కళ్యాణ్ అతనికి ఒక ముఖ్యమైన స్థానం, బాధ్యతను ఇచ్చారు. బన్నీ వాస్ ఇప్పుడు ఏకకాలంలో రాజకీయాలు, సినిమాలు రెండింటిలోనూ పని చేయనున్నాడు. నిర్మాత బన్నీ వాస్ కు చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్నయన్న విషయం తెలిసిందే. బన్నీ వాస్ ను తొలి నుంచి మెగా కాంపౌండ్ వ్యక్తిగానే భావిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.