Allu Arjun : పవన్ టికెట్ ఇవ్వలేదనే కోపంతోనే బన్నీ వైసీపీ అభ్యర్ధికి ప్రచారం..?

ఇక పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా అల్లు అర్జున్ జస్ట్ ఓ ట్వీట్‌తో సరిపెట్టాడు తప్పించి.. వ్యక్తిగతంగా కలవడం గానీ, ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు ఫ్యామిలీ కనిపించలేదు.

  • Written By:
  • Publish Date - June 15, 2024 / 02:32 PM IST

ప్రస్తుతం మెగా – అల్లు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. గత కొద్దీ రోజులుగా వీరి మధ్య వార్ నడుస్తున్నప్పటికీ.. ఏపీ ఎన్నికలు వీరి మధ్య మరింత అగ్గి రాజేశాయి. ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి ఇంటికి వెళ్లడం మెగా అభిమానుల్లో ఆగ్రహం నింపింది. పదేళ్లుగా సొంత మనిషి కష్టపడుతుంటే..అనరాని మాటలు వైసీపీ అంటుంటే ..అవన్నీ మరచి వైసీపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం ఏమాత్రం తట్టుకోలేకపోయారు. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కల్యాణ్‌కు అండగా నిలిస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. దీని తర్వాత అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, దానికి బన్ని అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అవ్వడం , అల్లు అర్జున్ అభిమానుల తాకిడికి నాగబాబు ట్విట్టర్ అకౌంట్‌ను కూడా డిలీట్ చేయడం చకచకా జరిగింది. ఇక ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం..అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులు అల్లు అర్జున్ ను మరింతగా టార్గెట్ గా చేస్తూ వస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా అల్లు అర్జున్ జస్ట్ ఓ ట్వీట్‌తో సరిపెట్టాడు తప్పించి.. వ్యక్తిగతంగా కలవడం గానీ, ఆఖరికి చిరంజీవి ఇంట్లో జరిగిన సంబరాల్లోనూ అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. ఒకవేళ బన్నీ ఏమైనా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడేమో అనుకున్న అల్లు అరవింద్ కానీ , అల్లు శిరీష్ , స్నేహ ఇలా ఎవ్వరు కూడా పాల్గొనలేదు. పోనీ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే.. మెగా ఫ్యామిలీలోని చిన్నా, పెద్ద బెజవాడలో ఒక రోజు ముందే ల్యాండ్ అయ్యారు. వారిలో అల్లు కుటుంబ సభ్యులు కనిపించలేదు. కనీసం పవన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ బన్నీ చిన్న ట్వీట్ కూడా చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఇలా ఇవ్వని చూస్తూ వచ్చిన మెగా మేనల్లుడు సాయిథరం తేజ్ .. అల్లు అర్జున్‌తో పాటు ఆయన సతీమణి స్నేహారెడ్డిని సోషల్ మీడియాలో ఆన్‌ ఫాలో చేసాడు. ఇలా వరుస పరిణామాలు మెగా – అల్లు ఫ్యామిలీల మధ్య దూరాన్ని మరింత పెంచేలా కనిపిస్తుండగా..తాజాగా సోషల్ మీడియా లో ఓ వార్త ఇప్పుడు మరింత వైరల్ గా మారుతుంది.

శిల్పా రవికి అల్లు అర్జున్ ప్రచారం చేయడం వెనుక మరో కారణం ఉందని అంటున్నారు. అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, నిర్మాత బన్నీవాసు వల్లే బన్నీ…వైసీపీ అభ్యర్ధికి ప్రచారం చేసాడనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీకి వీరాభిమాని అయిన బన్నీ వాసు .. గీతా ఆర్ట్స్‌లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే జీఏ2 పిక్చర్స్ బ్యానర్ ద్వారా బన్నీ వాసుని అల్లు అరవింద్ నిర్మాతగా చేశారు. జనసేన పార్టీలో యాక్టీవ్‌గా ఉండే బన్నీ వాసుని .. పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమించారు పవన్. తనపై పవన్ కళ్యాణ్ పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చేయకుండా బాగానే కష్టపడ్డారు. ఇక ఎన్నికల్లో పాలకొల్లు , పిఠాపురం లేదా ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బన్నీ వాసు భావించారు. తీరా టికెట్ల కేటాయింపులకు వచ్చే సరికి ఆయనకు నిరాశ ఎదురైంది.

ఈ విషయాన్ని బన్నీ వాసు అల్లు అరవింద్ దృష్టికి తీసుకెళ్లగా తాను పవన్ కళ్యాణ్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారట. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ తో మాట్లాడగా.. పొత్తులు, ఇతర సామాజిక సమీకరణాలు కారణంగా టికెట్ కేటాయించలేనని అరవింద్‌తో పవన్ తేల్చిచెప్పారట. తాము స్వయంగా రికమెండ్ చేసినా బన్నీ వాసుకు టికెట్ దక్కకపోవడం బన్నీ మనసులో బలంగా నాటుకుపోయిందని, అందుకే తన మిత్రుడు , వైసీపీ నేత శిల్పా రవి తరపున ప్రచారం చేశాడనే ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Read Also : Sesame Laddu : ఆడవాళ్లకు బలాన్నిచ్చే నువ్వుల లడ్డు.. తయారీ విధానం..