AP Debts : కూటమి సర్కారుపై విషం కక్కిన బుగ్గన.. అప్పులపై అబద్ధాలు

వైఎస్సార్ సీపీ సర్కారు(AP Debts) హయాంలో పాలన గాడి తప్పింది. దీంతో దేశంలోని రాష్ట్రాల ఆర్ధిక,ఆరోగ్య సూచీలో ఏపీ అట్టడుగు నుంచి 2వ స్థానంలో నిలిచింది.

Published By: HashtagU Telugu Desk
Buggana Rajendranath Reddy Andhra Pradesh Debts Ysrcp Ap Govt

AP Debts : ‘‘11 నెలల్లోనే ఏపీలోని కూటమి ప్రభుత్వం రూ.1.47 లక్షల కోట్లు అప్పులు చేసింది’’ అని వైఎస్సార్ సీపీ నేత, ఏపీ మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వాస్తవం ఏమిటంటే ఐదేళ్ల  పాలనా కాలంలో జగన్ సర్కారు చేసిన అప్పులను చూసి ఏకంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియానే దడుసుకుంది.  నాటి జగన్ సర్కారు అప్పుల కోసం చేసిన వేటను చూసి యావత్ దేశం ఆశ్చర్యపోయింది. ఇటువంటి నేపథ్యం కలిగిన జగన్ సర్కారులో ఆర్థికమంత్రిగా పనిచేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి నీతులు చెప్పే అర్హత ఉందా ? లెక్కలు చూసే అర్హత ఉందా ? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

Also Read :Bilawal Bhutto: నీళ్లివ్వకుంటే.. సింధూనదిలో రక్తం పారిస్తాం : బిలావల్

వైఎస్సార్ సీపీ హయాంలో దారుణంగా.. 

  • వైఎస్సార్ సీపీ సర్కారు(AP Debts) హయాంలో పాలన గాడి తప్పింది. దీంతో దేశంలోని రాష్ట్రాల ఆర్ధిక,ఆరోగ్య సూచీలో ఏపీ అట్టడుగు నుంచి 2వ స్థానంలో నిలిచింది. ఈవిషయాన్ని స్వయంగా నీతి ఆయోగ్ నివేదిక వెల్లడించింది. జగన్ సర్కారు చేసిన అప్పుల వల్లే ఇలా జరిగిందని పేర్కొంది.
  • రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉన్న అప్పుల వివరాలను నాటి వైఎస్సార్ సీపీ సర్కారు పూర్తిగా వెల్లడించలేదు.  ఆనాటి పెండింగ్ బిల్లులను కూడా కలుపుకుంటే.. వైఎస్సార్ సీపీ హయాంలో ఏపీ చేసిన అప్పులు మరింత ఎక్కువే ఉంటాయని  నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది.
  • వైఎస్సార్ సీపీ పాలనలో ఏపీ అప్పులు ఏకంగా 42 శాతం వృద్ధి చెందాయి. అయితే ఆ మేరకు రాష్ట్ర స్థూల ఆదాయం పెరగలేదు.
  • 1956 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకు 60 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలిన ప్రభుత్వాలు చేసిన అప్పు రూ.2.57 లక్షల కోట్లు.  గత వైసీపీ ప్రభుత్వం అయిదేళ్లలో చేసిన అప్పులు రూ 10 లక్షల కోట్లకు పైనే.

Also Read :Butta Renuka: వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం.. ఎందుకు ?

బుగ్గన .. ఇవి తెలుసుకోండి 

  • గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టింది.  ఈవిషయ బుగ్గనకు తెలియదా?
  • కేంద్ర ఆర్థిక సంఘం నిధుల్ని కూడా వైసీపీ సర్కారు వాడేసింది.
  • ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి సర్కారు గత 9 నెలల్లో రైతులకు ధాన్యం బకాయిల కింద రూ.1674 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.1800 కోట్లు, ఉద్యోగులకు జీపీఎఫ్ పెండింగ్ బిల్లుల కింద రూ.519 కోట్లు విడుదల చేసింది.
  • కొత్త ప్రభుత్వం పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిల కింద రూ.214 కోట్లు,సీపీఎస్‌కు సంబంధించిన బకాయిల కింద రూ.300 కోట్లు, టీడీఎస్ పెండింగ్ బిల్లుల కింద రూ.265 కోట్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కింద రూ.788 కోట్లను విడుదల చేసింది.
  • వివిధ రంగాలకు సంబంధించిన రూ.25,000 కోట్ల వైఎస్సార్  సీపీ ప్రభుత్వ బకాయిలను కూటమి ప్రభుత్వం తీర్చింది.
  • ఈ బకాయీలన్నీ తీర్చేందుకే గత 11 నెలల్లో చంద్రబాబు సర్కారు  రూ.1.47 లక్షల కోట్ల అప్పులు చేసింది.
  Last Updated: 26 Apr 2025, 12:37 PM IST