Brahmaji Counter To Minister Roja: మంత్రి రోజాకి బ్రహ్మజీ కౌంటర్.. ఏది నన్ను భయపెట్టలేదే అంటూ పంచ్

కొద్ది రోజుల క్రితం మంత్రి రోజాపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మంత్రిగా పని చేస్తున్న రోజాని (Minister Roja) డైమండ్ క్వీన్ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్య చేయడంతో ఈ విషయంపై వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఎదురుదాడి జరిగింది. వైసీపీ మంత్రులంతా ప్రెస్ మీట్ లు పెట్టి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం కనిపించింది.

Published By: HashtagU Telugu Desk
counter

Resizeimagesize (1280 X 720) (1)

కొద్ది రోజుల క్రితం మంత్రి రోజాపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం మంత్రిగా పని చేస్తున్న రోజాని (Minister Roja) డైమండ్ క్వీన్ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్య చేయడంతో ఈ విషయంపై వైసీపీ నుంచి పెద్ద ఎత్తున ఎదురుదాడి జరిగింది. వైసీపీ మంత్రులంతా ప్రెస్ మీట్ లు పెట్టి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం కనిపించింది. అయితే హైపర్ ఆది యువశక్తి సభలో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తనదైన శైలిలో ప్రాస డైలాగ్స్‌తో మాస్‌ని అలరించే ప్రయత్నం చేశాడు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు మంత్రి రోజా వద్ద ప్రస్తావించగా, హైపర్ ఆది లాంటి వాళ్లు గతంలో మీకు చాలా సన్నిహితంగా ఉండేవారు. అలాంటి వాళ్లు తిడుతుంటే మీకేమనిపిస్తుంది అని అడిగితే వాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది.

వాళ్లంతా చిన్నవాళ్లే కాబట్టి వెనుక ఎవరు మాట్లాడారో ఆలోచించుకోవాలని చెప్పారు. మెగా ఫ్యామిలీలో ఏడుగురు హీరోలు ఉన్నందున సినిమా అవకాశాలు రావు అనే భయంతో అలా మాట్లాడి ఉండొచ్చు అంటూ రోజా వ్యాఖ్యలు చేసింది. అయితే రోజా వ్యాఖ్యలకి సినీ నటుడు బ్రహ్మజీ కౌంటర్ ఇచ్చాడు. మెగా ఫ్యామిలీ ప్రచారం చేయమని కానీ పార్టీలో చేరమని కానీ నన్ను ఎప్పుడూ అడగలేదు, చిన్న ఆర్టిస్టులే కదా ఎందుకు అంత భయపడుతున్నారు అంటూ రోజాకు బ్రహ్మాజీ కౌంటర్ ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: Visakhapatnam: విశాఖపట్నంలో ఇద్దరు కూతుర్లను చంపి.. తండ్రి ఆత్మహత్య

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజా.. మంత్రి పదవి రాకముందు మెగా బ్రదర్ నాగబాబుతో జబర్దస్త్ షో చేసేవారు. మేనేజ్‌మెంట్‌తో గొడవల కారణంగా నాగబాబు జబర్దస్త్ నుండి తప్పుకున్నప్పటికీ రోజా మాత్రం ఆ షో చేస్తూ వచ్చారు. మంత్రి కాకముందే ఈ షో ఇలాగే కొనసాగిస్తే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని భావించి షో నుంచి తప్పుకుంది. అప్పటి వరకు తనతో బాగానే ఉన్న హైపర్ ఆది లాంటి వాళ్లు రాజకీయ వేదికలపైకి వచ్చి విమర్శలు చేస్తే రోజా తట్టుకోలేకపోతోంది. మరి ఈమె బ్రహ్మాజీకి కౌంటర్ ఇస్తుందో లేదో వేచి చూడాలి.

  Last Updated: 20 Jan 2023, 08:57 AM IST