Site icon HashtagU Telugu

Botsa Satyanarayana : ఏపీ నూతన విద్యాసంవత్సరంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ..

Botsa Satyanarayana pressmeet about 2023-24 educational year

Botsa Satyanarayana pressmeet about 2023-24 educational year

త్వరలో స్కూల్స్ కు సమ్మర్ హాలిడేస్(Summer Holidays) అయిపోనున్నాయి. నూతన విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. తాజాగా నేడు ఏపీలో 2023 – 24 విద్యాసంవత్సరంపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో రాబోయే విద్యా సంవత్సరం కోసం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

 

ప్రెస్ మీట్ లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. జూన్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా‌ పాఠశాలలు ప్రారంభమవుతాయి. 2500 రూపాయలతో ఒక్కో విద్యార్ధికి జగనన్న విద్యా కానుక కిట్ ఇస్తున్నాం. ఈ విద్యా కానుక కిట్ ను 12 వ తేదీ నాటికి ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. పెదకూరపాడు క్రోసూరు గ్రామంలో సిఎం జగన్ కొంతమంది విద్యార్ధులకు ఈ కిట్లు అందించి కార్యక్రమం ప్రారంభిస్తారు. మొదటి దశలో 12 వేల స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్ ను 12 నుంచి ప్రారంభించబోతున్నాం. విద్యార్థులు అభివృద్ధి చెందాలని మూడవ తరగతి నుంచి ఐదవ తరగతి, ఆరు నుంచి తొమ్మిది వరకు ప్రైమరీ జూనియర్ ను ప్రవేశపెడుతున్నాం. విద్యార్ధులకు బోధించే ఉత్తమ ఉపాధ్యాయులను విదేశాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తాం. గోరు ముద్ద ద్వారా విద్యార్ధులకు మంచి భోజనం అందిస్తున్నాం. నూతన విద్యా విధానంలో మార్పులకు అనుగుణంగా ఏపీలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టాం. ఫౌండేషన్ నుంచే‌ విద్యార్ధి ఎదుగుదలకు చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.

అలాగే.. పదవ తరగతి, ఇంటర్ లో టాపర్లను ఈ నెల 20న సీఎం జగన్ సత్కరిస్తారు. రాష్ట్రంలోని అన్ని హైస్కూల్స్ లో టాపర్లను సత్కరిస్తారు. ఈ నెల 28 న‌ అమ్మఒడిని సీఎం జగన్ విడుదల చేస్తారు అని తెలిపారు.

నూతన విద్యా సంవత్సరంపై విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ తో పాటు విద్యా కానుక ద్వారా అన్ని అందిస్తున్నాం. పూర్తి నాణ్యతతోనే విద్యా కానుక కిట్లను విద్యార్ధులకు అందిస్తున్నాం. విద్యార్ధులకు, తల్లిదండ్రులకు యూనిఫామ్ పై అవగాహన కల్పిస్తున్నాం. గత ఏడాదిలో చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం అని అన్నారు.

 

Also Read : Kesineni Nani: టీడీపీ గొట్టం గాళ్ళ కోసం పని చేయాల్సి వస్తుంది: కేశినేని ఘాటు వ్యాఖ్యలు