Site icon HashtagU Telugu

Boat Incident @ Prakasam Barrage : టీడీపీ – వైసీపీ మధ్య బోట్ల పంచాయితీ

Botla Panchayat

Botla Panchayat

Botla panchayat between TDP and YCP : ఏపీలో వర్షాలు , వరదలు తగ్గుముఖం పట్టడం తో మళ్లీ అధికార పార్టీ టీడీపీ – వైసీపీ (TDP vs YCP War ) మధ్య మాటల యుద్ధం మొదలైంది. విజయవాడ (Vijayawada)నీట మునిగిపోవడానికి కారణం వైసీపీ అని టీడీపీ విమర్శిస్తుంటే…లేదు ముమ్మాటికీ టీడీపీ తప్పిదం వల్లే ఇలా జరిగిందని వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు బోట్ల పంచాయితీ (Botla panchayat) రోజు రోజుకు ఎక్కవుతుంది. బ్యారేజ్ లోకి నాల్గు బొట్లు కొట్టుకవచ్చి..గేట్లను బలంగా తగలడం తో అవి డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతం వాటి మరమత్తులు చేసి సక్సెస్ అయ్యింది ప్రభుత్వం. కాకపోతే ఈ బొట్లు పలువురు వైసీపీ నేతలకు చెందడం తో వైసీపీ కుట్రలో భాగమే ఈ డ్యామేజ్ అని టీడీపీ ఆరోపిస్తుంది.

ఈ ఘటన కు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు..వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ (MLC Talasila Raghuram ), మాజీ ఎంపీ నందిగం సురేష్​ (Ex MP Nandigam Suresh) అనుచరుల బోట్లుగా గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్​, ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకున్నారని నివేదికలో పేర్కోవడం జరిగింది. ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)ట్విట్టర్ వేదికగా కీలక ట్వీట్ చేసారు. ప్రకాశం బ్యారేజీ కూల్చి లక్ష మందికిపైగా ప్రజలను చంపటమే జగన్ లక్ష్యమని లోకేష్ ఆరోపించారు. ‘అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపి, 5 ఊర్ల నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి కూల్చేసి, విజయవాడతో పాటు లంక గ్రామాలను నామ రూపాలు లేకుండా చేయాలని పన్నిన కుట్ర బట్టబయలైంది’ అని ట్వీట్ చేశారు.

ఈ అంశం ఫై వైసీపీ ట్వీట్ చేసింది. ఎన్నికల్లో గెలవగానే ఆ బోట్లలోనే టీడీపీ ర్యాలీ చేసిందని వైసీపీ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఎన్నికల్లో గెలవగానే ఆ బోట్లతో ర్యాలీ చేసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని, అవే బోట్లు బ్యారేజ్ను ఢీకొన్నాయని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. అడ్డంగా దొరికినా సిగ్గులేకుండా వైసీపీపై నిందలా అని చంద్రబాబును ప్రశ్నించింది. ఇంతకంటే దిక్కుమాలినతనం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also : TGNPDCL : ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసం ఎన్పీడీసీఎల్‌ కొత్త పథకం