ఏపీ (AP) లో రాజకీయాలు ఎవరికీ అర్థంకావడం లేదు..ఎవరెవర్ని కలుస్తున్నారో…? ఎవరెవరో ఏ పార్టీలో చేరుతున్నారో..? ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతున్నారో చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ (YCP) కి ప్రతి రోజు వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నటి వరకు ఆ పార్టీ లో కీలక నేతలుగా ఉన్న వారంతా..ఇప్పుడు బై బై చెప్పి సైకిల్ (TDP) ఎక్కిస్తున్నారు. ఇదే క్రమంలో జగన్ ఫ్యామిలీ సభ్యులంతా టీడీపీ క్యాడర్ తో టచ్ లో ఉండడం వైసీపీ శ్రేణులను నిద్ర పట్టకుండా చేస్తుంది. మొన్నటి మొన్న క్రిస్మస్ సందర్బంగా వైస్ షర్మిల (YS SHarmila)..నారా చంద్రబాబు (Chnadrababu) కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్ పంపడం అంత మాట్లాడుకునేలా చేసింది. ఇక నేడు షర్మిల భర్త..బ్రదర్ అనిల్ కుమార్..బీటెక్ రవితో భేటీ కావడం సర్వత్రా చర్చ గా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
ఓ పక్క షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రేపు ఢిల్లీకి వెళుతున్నారు. షర్మిళ ఏపీకి వచ్చి కాంగ్రెస్‌లో రాజకీయం చేస్తే పరిస్థితి మారిపోతుందని ముఖ్యంగా కడప జిల్లాలో ఆ ప్రభావం ఉంటుందన్న అంచనాలు మొదలయ్యాయి. ఇక వైసీపీకి దూరం అయిన నేతలు..షర్మిళ వెంట నడవాలని డిసైడ్ అవుతున్నారు. ఇప్పటికే వైసీపీ కి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిళతో కలిసి కాంగ్రెస్‌లో చేరుతానని ప్రకటించారు.
ఇదిలా ఉంటె కడప విమానాశ్రయంలో బ్రదర్ అనిల్ తో టీడీపీ నేతలు బీటెక్ రవి (Bother Anil Kumar meeting with BTech Ravi ), మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి తో సమావేశం జరిగింది. ఇది మర్యాదపూర్వక భేటీగా బీటెక్ రవి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. కాకపోతే రాజకీయ అంశాల ప్రస్తావన జరిగిందని తెలుస్తుంది. బీటెక్ రవి పులివెందులలో సీఎం జగన్ పైన పోటీకి సిద్దం అవుతున్నారు. కడప లోక్ సభ నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీతను బరిలోకి దింపాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరటం ద్వారా షర్మిల లేదా సునీత కడప లోక్ సభ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇలా రోజుకో ఆసక్తికర ఘటన చోటుచేసుకుండడంతో ప్రజల్లో ఆసక్తి మరింత పెరుగుతుంది.
Read Also : Telangana: తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌ల బదిలీ