Z-plus Security to Nara Lokesh: నారా లోకేష్‌కు జెడ్‌ప్లస్ భద్రతపై బొత్స సెటైర్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు భద్రత పెంచడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. లోకేష్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం కోసమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.

Z-plus Security to Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు భద్రత పెంచడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. లోకేష్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం కోసమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఆదివారం మీడియాతో బొత్స మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేతలకు పటిష్ట భద్రత కల్పించవచ్చు కానీ లోకేశ్‌కు అంత భద్రత ఎందుకని.. ప్రజల ఆగ్రహానికి గురై నాలుకను అదుపు చేసుకోలేని వారికి అదనపు భద్రత అవసరమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు .

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులో ఉన్న నేపథ్యంలో ఏపీలో వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను నేరుగా లబ్దిదారులకు పంపిణీ చేయకూడదని జగన్ ప్రభుత్వానికి భారత ఎన్నికల సంఘం (ECI) ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇదే విషయంపైమంత్రి స్పందిస్తూ. రాష్ట్రంలో పేదలకు పింఛన్లు రాకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని, సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా చేసి వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేయడమే టీడీపీ రాజకీయమని బొత్స అన్నారు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) 2024 ఫలితాల ప్రకటన విడుదలను పాఠశాల విద్యా శాఖ (AP DSE) వాయిదా వేయడం విచారకరమన్నారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి అమలు చేస్తామని చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వివాదంపై బొత్స మాట్లాడుతూ.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతుల్లో లేదని, ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో తమ వ్యతిరేకతను ఇప్పటికే తెలిపామని చెప్పారు. అయితే ఇప్పుడు బీజేపీతో చేతులు కలిపింది ఎవరని ప్రశ్నించారు. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కలిసి స్టీల్‌ప్లాంట్‌పై తమ వైఖరిని ఎప్పుడు చెబుతాయోననీ అన్నారు బొత్స.

We’re now on WhatsAppClick to Join.

ఏపీలో సెజ్‌లు, ఫార్మా, ఐటీ హబ్‌లను ఏర్పాటు చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ఉత్తరాంధ్ర పారిశ్రామికంగా అభివృద్ధి చెందిందని మంత్రి తెలిపారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఖాతాలో చూపేదేమీ లేదని ఎద్దేవా చేశారు బొత్స.

Also Read: KCR : రైతు బాధ విని చలించిపోయిన కేసీఆర్.. రూ.5 లక్షల ఆర్థికసాయం