ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం మరోసారి ఉత్కంఠ రేపుతోంది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ (Bolisetti Srinivas) తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా సెల్వమణి(Roja)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బొలిశెట్టి, రోజా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. “రోజా ఆడదో మగదో కూడా తెలియడం లేదు” అని చేసిన వ్యాఖ్యలతో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు.
AP News : ఏపీ రైతులకు శుభవార్త.. తోతాపురి మామిడి కొనుగోలుపై చారిత్రక ఆమోదం.!
బొలిశెట్టి మాట్లాడుతూ.. “రోజా ఎమ్మెల్యే నా కొడుకులు అంటోంది. మరి జగన్ కూడా ఆమె కొడుకేనా? ఆయన కూడా ఎమ్మెల్యే కదా. చంద్రబాబు కూడా ఆమె కొడుకేనా? ఆయన కూడా ఎమ్మెల్యేనే కదా” అని ప్రశ్నించారు. రోజా వయసు, తన వయసు పోల్చుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కొంతమంది కాపులను ఉసిగొల్పి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడిస్తున్నారని” బొలిశెట్టి విమర్శించారు. అలాగే అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి నేతలపై కూడా తీవ్ర పదజాలాన్ని వాడుతూ, వీళ్లు పనికిమాలినోళ్లు అని ఎద్దేవా చేశారు.
“మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు, రాబోయే రోజుల్లో జగన్‌ను కూడా అరెస్టు చేస్తారు” అని జోస్యం చెప్పారు. “అందరూ మామూలు దొంగలైతే జగన్ గజదొంగ. లిక్కర్, గనులు, ఇసుక, అడవులు అన్నీ దోచుకున్నాడు” అంటూ ఆరోపించారు. అలాగే కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉండాలని, లేకపోతే రాష్ట్రానికి అభివృద్ధి దూరమవుతుందని బొలిశెట్టి అన్నారు. జనసేన 21 నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అందర్నీ ఒక చోట కూర్చోబెట్టి డిబేట్ పెడితే మన బాధ ఏంటో అర్థమవుతుంది. మనం కలసి ఉంటేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. లేకపోతే ఐదు సంవత్సరాలు అడుక్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు. బొలిశెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి నాంది పలికాయి.