BJP-YCP : చ‌క్ర‌బంధంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్

చంద్ర‌బాబు ప‌ద్మ‌వ్యూహంలో చిక్కారా? బీజేపీ, వైసీపీ (BJP-YCP)వేసిన వ‌ల‌లో ప‌డ్డారా?ప‌వ‌న్ కు తెలియ‌కుండా రెండు పార్టీల పాచిక పారిన‌ట్టేనా?

  • Written By:
  • Updated On - June 24, 2023 / 02:11 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ద్మ‌వ్యూహంలో చిక్కారా? బీజేపీ, వైసీపీ (BJP-YCP)వేసిన వ‌ల‌లో ప‌డ్డారా? ప‌వ‌న్ క‌ల్యాణ్ కు తెలియ‌కుండా ఆ రెండు పార్టీలు వేసిన పాచిక పారిన‌ట్టేనా? గ‌త రెండు వారాలుగా చంద్ర‌బాబు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏపీ రాజ‌కీయం వైసీపీ, జ‌న‌సేన మ‌ధ్య న‌డుపుతున్న‌దెవ‌రు? ఇలాంటి ప్ర‌శ్న‌లు స‌గ‌టు ఏపీ పౌరుడికి రావ‌డం స‌హ‌జం. ఎందుకంటే, ఇటీవ‌ల దాకా టీడీపీ, వైసీపీ మ‌ధ్య న‌డిచిన గేమ్ ఒక్కసారిగా మ‌లుపు తిరిగింది. గ‌త రెండు వారాలుగా వైసీపీ, జన‌సేన వ‌యా బీజేపీ త‌ర‌హాలో ఏపీ రాజ‌కీయం కనిపిస్తోంది.

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ద్మ‌వ్యూహంలో చిక్కారా?(BJP-YCP) 

ఏపీలో కింగ్ మేక‌ర్ కావాల‌ని బీజేపీ భావిస్తోంది. తెలంగాణలో కింగ్ కావాల‌ని క‌లలు కంటోంది. ఈ రెండు ల‌క్ష్యాలు చేరుకోవ‌డానికి చంద్ర‌బాబు కీల‌కం. ఆయ‌న చుట్టూ రాజ‌కీయాన్ని న‌డిపితేనే బీజేపీ టార్గెట్ రీచ్ కాదు. అందుకే, చంద్ర‌బాబును బ‌లహీన ప‌ర‌చ‌డానికి జ‌న‌సేనాని ప‌వ‌న్ ను పావుగా వాడుతోంది. అందుకు వైసీపీ స‌హ‌కారం అందిస్తోంది. గ‌త రెండు వారాల రాజ‌కీయాన్ని అవ‌లోక‌నం చేసుకుంటే చంద్ర‌బాబును రాజ‌కీయ చ‌క్ర‌బంధంలోకి (BJP-YCP) నెట్టేస్తున్నారా? అనే అనుమానం క‌లుగుతోంది.

బీజేపీ డైరెక్ష‌న్లో జ‌రిగిన త‌తంగం

ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. మ‌హానాడు వేదిక‌గా ఆరు వ‌జ్రాల‌ను కూడా చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. మినీ మేనిఫెస్టో కు వ‌స్తోన్న ఆద‌ర‌ణ‌ను పెంచుకోవ‌డానికి రాష్ట్ర న‌లుమూల‌ల బ‌స్సు యాత్ర కు రూప‌క‌ల్ప‌న చేశారు. కానీ, రాజ‌కీయంగా వైసీపీ వేస్తోన్న ఎత్తుగ‌డ‌ల‌ను తిప్పికొట్ట‌డంలో చంద్ర‌బాబు టైమింగ్ మిస్ అవుతోంది. అదెలా అంటే, దూకుడుగా వెళుతోన్న టీడీపీ మీద వారాహిని బీజేపీ ప్ర‌యోగించింది. జ‌న‌సేనాని ప‌వ‌న్ ఆ వాహ‌నం మీద నుంచి వైసీపీ లీడ‌ర్లను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేశారు. ఇదంతా బీజేపీ డైరెక్ష‌న్లో జ‌రిగిన త‌తంగం. ఎందుకుంటే, తొమ్మిదేళ్ల న‌రేంద్ర మోడీ పాల‌న ప్ర‌గ‌తి మీద విశాఖ‌, తిరుప‌తిలో జ‌రిగిన మీటింగ్ ల్లో అమిత్ షా, న‌డ్డా వినిపించిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై అవినీతి ఆరోప‌ణ‌ల‌ను ప‌వ‌న్ కొన‌సాగించారు. కాక‌పోతే, ఎమ్మెల్యేల‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేశారు. ప‌రుష‌ప‌ద‌జాలాన్ని వాడారు. దీంతో ఆయ‌న హుందాత‌నం పోయింది.

కాపు కులం మ‌ధ్య రచ్చ‌గా వారాహి యాత్ర‌ను మార్చ‌డంలో వైసీపీ విజ‌యం

కాపు సామాజిక‌వ‌ర్గం లీడ‌ర్ గా జ‌న‌సేన‌కు తొలి నుంచి ముద్ర‌ప‌డింది. దాన్ని మ‌రింత ఎలివేట్ చేసేలా వైసీపీ వ్యూహాత్మంగా ప‌వ‌న్ మీద ప్ర‌తిదాడికి దిగింది. సామాజిక వ‌ర్గాల మ‌ధ్య విద్వేషాల్ని తెచ్చేలా వారాహి యాత్ర సాగుతోంది. వెట‌ర‌న్ లీడ‌ర్లు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, హ‌రిరామ‌జోగ‌య్య లు రంగంలోకి దిగ‌డంతో కాపుల మ‌ధ్య ర‌గ‌డగా మారింది. అంతేకాదు, కాపుల‌కు వ్య‌తిరేకంగా మిగిలిన సామాజిక‌వ‌ర్గాల‌ను సమీక‌రించే వ్యూహాన్ని వైసీపీ ప‌న్నింది. గ‌త కొంత కాలంగా క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తూ మిగిలిన సామాజిక‌వ‌ర్గాల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చేలా జ‌గ‌న్ గేమాడారు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అనుస‌రిస్తున్నారు. తాజాగా కాపు సామాజిక‌వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తూ ఆ సామాజిక‌వ‌ర్గానికి మిగిలిన ఉప కులాల‌ను కూడా దూరం చేసే వ్యూహం ర‌చించారు. కాపు కులం మ‌ధ్య రచ్చ‌గా వారాహి యాత్ర‌ను మార్చ‌డంలో(BJP-YCP) వైసీపీ విజ‌యం సాధించింది.

జ‌న‌సేనాని ప‌వ‌న్ ను కూడా టీడీపీతో క‌ల‌వ‌నివ్వ‌దు (BJP-YCP)

ఈ మొత్తం ఎపిసోడ్ లో తెలుగుదేశం పార్టీ ప్ర‌మేయం ఏమీలేదు. జ‌రుగుతోన్న ర‌చ్చ‌ను చూస్తోంది. బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు మాత్రం జ‌న‌సేనాని ప‌వ‌న్ భుజం మీద తుపాకీ పెట్టి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని గురిపెట్టిన‌ట్టు కనిపిస్తున్న‌ప్ప‌టికీ ట్రిగ‌ర్ నొక్కే స‌మ‌యానికి చంద్ర‌బాబు వైపు తుపాకీ మళ్లుతోంది. ఇలాంటి వ్యూహాన్ని అటు ప‌వ‌న్ ఇటు టీడీపీ గ‌మ‌నించ‌లేని ప‌రిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే, బీజేపీతో క‌లిసి న‌డ‌వ‌డానికి ఒపెన్ ఆఫ‌ర్ ను చంద్ర‌బాబు ఇచ్చారు. కానీ, ఆ పార్టీ. ఇప్ప‌టి వ‌రకు ఎలాంటి సానుకూల సంకేతాలు పంప‌లేదు. ఇక ప‌వ‌న్ మూడుసార్లు చంద్ర‌బాబును క‌లిశారు. పొత్తు కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బీజేపీని కూడా క‌లుపుకుని కూట‌మిగా వెళ్లాల‌ని ఆలోచిస్తున్నారు. కానీ, అటు చంద్ర‌బాబు ఇటు ప‌వ‌న్ ఆలోచ‌న‌కు బిన్నంగా వైసీపీని బ‌ల‌పేతం చేసేలా బీజేపీ వ్యూహాత్మ‌క (BJP-YCP) గేమాడుతోంది.

Also Read : YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!

ఏపీలో బీజేపీ, వైసీపీ (BJP-YCP) మ‌ధ్య బంధాన్ని ఎవ‌రూ విడ‌దీయ‌లేరు. పైకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న‌ప్ప‌టికీ లోలోప‌ల అండ‌ర్ స్టాండ్ బాగా ఉంది. ఇద్ద‌రూ క‌లిసి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. రాబోవు ఎన్నిక‌ల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి రావ‌డానికి స‌హ‌కారం బీజేపీ అందిస్తోంది. అందుకే, నిధుల‌ను కూడా ఇటీవ‌ల ఉదారంగా విడుద‌ల చేసింది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద ఉన్న కేసుల నుంచి బీజేపీ కాపాడుతోంద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. ఇలాంటి ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబుతో కలిసి బీజేపీ ప‌నిచేయ‌డానికి సిద్ద‌ప‌డ‌దు. అంతేకాదు, జ‌న‌సేనాని ప‌వ‌న్ ను కూడా టీడీపీతో క‌ల‌వ‌నివ్వ‌దు. ఆ దిశ‌గా వైసీపీ, బీజేపీ వ్యూహాన్ని పండిస్తున్నారు. దానిలో ప‌వ‌న్, చంద్ర‌బాబు ప‌డిపోయార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : BJP: బీజేపీ అలర్ట్, ఢిల్లీకి ఈటల, కోమటిరెడ్డి!