Site icon HashtagU Telugu

BJP – TDP – YCP : ఒకేసారి చంద్రబాబు, జగన్‌లతో బీజేపీ చర్చలు.. వ్యూహం అదేనా ?

Bjp Tdp Ycp

Bjp Tdp Ycp

BJP – TDP – YCP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పోషించబోయే పాత్ర ఏమిటి ? బీజేపీ హైకమాండ్ చంద్రబాబు, జగన్‌లతో వరుసగా రెండు రోజుల్లో రెండు వేర్వేరు సమావేశాలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి ?  బీజేపీకి శత్రువు ఎవరు.. మిత్రువు ఎవరు ?  అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈ పరిణామాలపై రాజకీయ పరిశీలకుల విశ్లేషణను ఓసారి చూద్దాం.

We’re now on WhatsApp. Click to Join

బీజేపీ జాతీయ పార్టీ.. దాని ఫోకస్ అంతా వచ్చే లోక్‌సభ ఎన్నికలపైనే ఉంది. మూడోసారి ఎలాగైనా ప్రధాని కావాలనే పట్టుదలతో పీఎం నరేంద్రమోడీ ఉన్నారు. మోడీ ఫోకస్ అనేది ఎన్డీఏ కూటమి బలోపేతంపైనే ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయడంపై అంతగా ఫోకస్ పెట్టడం లేదు. ఇటీవల తెలంగాణలో బండి సంజయ్‌ను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడమే దానికి నిదర్శనం. బలమైన మిత్రపక్షాలను రెడీ చేసుకుంటే.. ఒకవేళ 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత హంగ్ ఏర్పడితే మద్దతును పొందొచ్చని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈక్రమంలోనే వైఎస్సార్ సీపీ, టీడీపీ రెండింటితోనూ(BJP – TDP – YCP) స్నేహంగా మెలగాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ అంటే ఏపీ ఫ్రెండ్లీ అనే ట్యాగ్ లైన్‌తో ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలని యోచిస్తోంది. ఒకవేళ టీడీపీ – బీజేపీ – జనసేన మధ్య పొత్తు కుదిరినా.. జగన్ సేనపై విమర్శలు చేయకుండా ఉండాలని బీజేపీ భావిస్తోందట. తద్వారా లోక్‌సభ ఎన్నికల తర్వాత మారబోయే పరిణామాల్లో జగన్ మద్దతును కూడా కూడగట్టొచ్చని కమలదళం భావిస్తోందట. ఏపీలో 25 లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఈ వ్యూహం వల్ల ఏపీలో ఏ పార్టీ గెలిచినా ఆ సీట్లన్నీ బీజేపీకే  మద్దతుగా ఉంటాయి.  సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లుగా పరోక్షంగా ఎన్డీఏ కూటమికే మద్దతు ఇచ్చారు. అందుకే చాలా స్కీమ్స్‌లో ఏపీకి విరివిగా నిధులను కేటాయిస్తున్నారు. ఏపీ సీఎం జగన్‌కు కేంద్రం పెద్దల అపాయింట్మెంట్లు కూడా వెంటనే లభిస్తున్నాయి.

Also Read : Valentines Day : ‘వాలెంటైన్స్ డే’ రోజు ఆ నాలుగు రాశులవారికి లక్కీ ఛాన్స్

పొత్తులో భాగంగా తగినన్ని ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తే టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించాలని బీజేపీ భావిస్తోంది.  కేంద్రంలో వచ్చే సారి కూడా బీజేపీ గెలవడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలో చేరేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని చెబుతున్నారు. కానీ ఈ విషయంలో ఏ అడుగూ స్మూత్ గా పడటం లేదని .. టీడీపీ వైపు నుంచి పాజిటివ్ గా ఒక్క ప్రకటన కూడా రాకపోవడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నా.. పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఆ పార్టీకి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ లేరు. అందుకే ఏపీ దిగ్గజ నేతలైన జగన్, చంద్రబాబులను ప్రసన్నం చేసుకునే పనిలో బీజేపీ హైకమాండ్ పడింది. అమిత్ షా , జేపీ నడ్డాలతో  చంద్రబాబు భేటీ ముగిసిన తర్వాతి రోజే  సీఎం జగన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ ఖరారైందని ఆయనకు సమాచారం వచ్చింది. దీంతో గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రధానితో  భేటీ అని ప్రచారం జరిగినప్పటికీ అమిత్ షాను కూడా కలిశారు. భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని.. చంద్రబాబుతో భేటీ విషయంలో అంత సంతృప్తికరంగా  లేకపోవడంతోనే  ఉన్న పళంగా జగన్ కు అపాయింట్ మెంట్లు ఖరారు చేశారని అంటున్నారు. వైసీపీ అధనేత, సీఎం జగన్ తో ఖచ్చితంగా రాజకీయాలే  చర్చించి ఉంటారని..  అంచనా  వేస్తున్నారు.

Also Read :  Bharat Rice : తెలంగాణలో ‘భారత్ రైస్’ సేల్స్ ఎప్పటి నుంచి ?

Exit mobile version