BJP: ఏపీలో బీజేపీ ఎన్నికల ఇన్చార్జిల నియామకం

  BJP: ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు(Assembly-Lok Sabha elections)ఒకే విడతలో జరగనున్నాయి. పోలింగ్ కు తగినంత సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీ బీజేపీ(bjp) తాజాగా పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జి(Election Incharge)లను ప్రకటించింది. We’re now on WhatsApp. Click to Join. ఏపీ ఎన్నికల ఇన్చార్జిలుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్(Arun Singh), ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ […]

Published By: HashtagU Telugu Desk
Bjp Appoints Election Incha

Bjp Appoints Election Incha

 

BJP: ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు(Assembly-Lok Sabha elections)ఒకే విడతలో జరగనున్నాయి. పోలింగ్ కు తగినంత సమయం ఉండడంతో ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. జాతీయ పార్టీ బీజేపీ(bjp) తాజాగా పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జి(Election Incharge)లను ప్రకటించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీ ఎన్నికల ఇన్చార్జిలుగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్(Arun Singh), ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్(Siddharth Nath Singh) లకు బాధ్యతలు అప్పగించారు.

read also: CM Revanth: కేసీఆర్ పతనం మల్కాజిగిరి పార్లమెంట్ నుంచే మొదలైంది: సీఎం రేవంత్

అదే సమయంలో రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు కూడా ఎన్నికల ఇన్చార్జిలను నియమిస్తూ బీజేపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రాజస్థాన్ ఇన్చార్జిలుగా వినయ్ సహస్రబుద్ధే, విజయ రహాత్కర్, ప్రవేశ్ వర్మ… హర్యానా ఇన్చార్జిలుగా సతీశ్ పునియా, సురేంద్ర సింగ్ నాగర్ లను నియమించింది.

read also: Vijayawada: విజయవాడ టికెట్ పై రోడ్డెక్కిన జనసేన

ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన ఇప్పటికే పలువురు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించగా, బీజేపీ కసరత్తులు చేస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఏపీలో 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు.

  Last Updated: 21 Mar 2024, 04:37 PM IST