Bird Flu Chickens: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. దీంతో జనం చికెన్, కోడి గుడ్లు తినడం లేదు. తాజాగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తి కి బర్డ్ ఫ్లూ వైరస్ సోకింది. కోళ్ల ఫామ్ సమీపంలో ఉంటున్న వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వైద్యాధికారులు అతడి శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపారు. అక్కడ శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా, సదరు వ్యక్తికి బర్డ్ ఫ్లూ ఉందని వెల్లడైంది. దీంతో వైద్యాధికారులు ఉంగుటూరు మండలంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. జిల్లాలో మనుషుల్లో నమోదైన తొలి బర్డ్ ఫ్లూ కేసు ఇదేనని వైద్యాధికారిణి డాక్టర్ మాలిని చెప్పారు.
Also Read :Rs 6000 Crore Dump: ఈ చెత్తకుప్పలో రూ.6,500 కోట్ల బిట్‌కాయిన్లు.. కొనేందుకు టెకీ రెడీ
కోళ్లను పూడ్చిపెట్టే పనిని..
ఏపీలోని గోదావరి జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో ఆ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టారు. అయితే తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను చెరువుల్లో చేపలకు మేతగా వేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియోలు తాజా బయటికి వచ్చాయి. సాధారణంగా చేపల చెరువుల నిర్వాహకులు చికెన్ షాపుల్లోని వ్యర్థాలను చేపలకు మేతగా వేస్తుంటారు. కానీ ఇప్పుడు ఏకంగా కోళ్లనే చేపలకు దానాగా వేస్తున్నారు. బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. అందుకే పలు కోళ్ల ఫామ్‌ల యజమానులు చనిపోయిన కోళ్లను చేపల చెరువుల నిర్వాహకులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. తద్వారా పూడ్చిపెట్టే ఖర్చుల నుంచి బయటపడుతున్నారు.
Also Read :Kalvakuntla Kavitha: జగిత్యాల సీటుపై కవిత ఫోకస్.. టార్గెట్ అసెంబ్లీ
పెద్ద సంఖ్యలో కోళ్ల మరణాలు
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను(Bird Flu Chickens) వ్యాన్‌లలో జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం మండలాలకు తరలించి చెరువులలో చేపలకు మేతగా వేస్తున్నట్లు సమాచారం. గత మూడు రోజుల్లో తణుకు మండలంలోని వేల్పూరు, పెరవలి మండలం కానూరు అగ్రహారం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని అనేక ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో కోళ్ల మరణాలు సంభవించాయని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి.దామోదర్ నాయుడు తెలిపారు.