Site icon HashtagU Telugu

Sanatana Dharma : పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతించిన బిహార్ బీజేపీ నేతలు

Pawan Warning To YCP

Pawan Warning To YCP

జనసేన అధినేత, ఏపీడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సనాతన ధర్మ పరిరక్షణ(Sanatana Dharma)కు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడాన్ని బిహార్ బీజేపీ నేతలు (Bihar BJP Leaders) స్వాగతించారు. బిహార్ మంత్రి నీరజ్ బాబు ఈ విధమైన వింగ్ బిహార్లో కూడా అవసరమని , సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ RJD నేత మృత్యుంజయ్ తివారీ మాత్రం ఈ నిర్ణయంపై విమర్శలు చేశారు. ఆయన ఈ చర్యను ప్రజల క్షేత్రస్థాయి సమస్యల నుండి దృష్టి మరల్చడానికి చేసిన ప్రయత్నమని, ఈ విధంగా ప్రచారం చేసే నేతలందరూ నకిలీ సనాతనీయులని ఆరోపించారు. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ హిందూత్వ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే దిశగా ముందుకు వెళ్తున్నారు. తాజాగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకోవడం రకరకాల చర్చలకు కారణం అవుతోంది. నరసింహ వారాహి గణం పేరుతో త్వరలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తానని పవన్ ప్రకటించారు. ఇవి అదికారికంగా జనసేన పార్టీకి అనుబందంగా ఉన్నట్లుగా ప్రకటించినా ప్రకటించకపోయినా ఆ పార్టీ హిందూత్వ కార్యకర్తలే అందులో ఉంటారని అనుకోవచ్చు. బీజేపీకి ఇలాంటి గ్రూప్ భజరంగ్ దళ్ ఉంటుంది. అలాగే అనేక హిందూ సంస్థలకూ బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తుంది. వాటి ఏర్పాటులోనూ కీలంగా వ్యవహరించింది. ఇప్పుడు భజరంగ్ దళ్ తరహాలో పవన్ కల్యాణ్ ఈ నారసింహ వారాహి గణాన్ని నియమించనున్నారని భావించవచ్చు.

జనం కోసమే పుట్టిన జనసేన.. ఇప్పుడు.. సనాతన సేనగా మారుతోందా? సనాతన ధర్మ పరిరక్షణకు సిద్ధమైన పవన్ కల్యాణ్.. పార్టీ సిద్ధాంతాన్ని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారా? తిరుమల లడ్డూ వివాదం తర్వాత.. పవన్ కల్యాణ్ భాష మారింది. వేషం మారింది. ఆయన సిద్ధాంతమే మారిపోయింది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Ration card : సంక్రాంతి తర్వాత సన్నబియ్యం పంపిణీ : మంత్రి ఉత్తమ్..!