Bhogapuram Airport : భోగాపురం విమానాశ్రయం నమూనా వీడియోను విడుదల

  • Written By:
  • Updated On - December 16, 2023 / 09:30 PM IST

నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం (Bhogapuram )లో నిర్మించి తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram Airport) నమూన వీడియోని జిఎంఆర్ కార్పొరేషన్ విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీనికి తగ్గట్టే ఆ సంస్థ విమానాశ్రయానికి సంబంధించి ప్రహరీ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 14 ఫిబ్రవరి 2019 విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు.

అయితే శంకుస్థాపన చేసినా పనులు ప్రారంభం కాలేదు. ఏ విధమైన అనుమతులు, నో అబ్జక్షన్ సర్టిఫికేట్లు లభించలేదు. ఆ తరువాత అధికారంలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం భోగాపురంపై ప్రత్యేక దృష్టి సారించింది. ముందుగా భూసేకరణ పూర్తి చేసింది. ఆ తరువాత టెండర్ ప్రక్రియ పూర్తి చేసి జీఎంఆర్‌కు కాంట్రాక్ట్ ఇచ్చింది. ఎన్‌వోసీ, వివిధ రకాల అనుమతులే కాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టులోని న్యాయ వివాదాలు పరిష్కరించింది.

We’re now on WhatsApp. Click to Join.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రత్యేకతలు (Bhogapuram International Airport Features) :

ఈ విమానాశ్రయం పూర్తయితే ఏడాదికి 1.8 కోట్ల మంది ప్రయాణించే వీలుంటుంది. తొలి దశలో ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణించనున్నారు. పీపీపీ విధానంలో నిర్మించే విధంగా జీఎంఆర్ గ్రూపుతో ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రయాణీకులకు ఆధునికంగా ట్రంపెట్ నిర్మాణం, విశాఖ, శ్రీకాకళం జిల్లా ప్రజలు నేరుగా టెర్మినల్ చేరుకునే సౌకర్యాలున్నాయి. అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఎగ్జిట్ గేట్ వే కోసం కార్గో టెర్మినల్, లాజిస్టిక్స్ ఎకో సిస్టమ్, తొలిదశలో 5000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కార్గో అభివృద్ధి ఉంటుంది. పూర్తి ఆధునిక పరిజ్ఞానంతో రన్ వే, కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ అప్రాన్, ప్యాసెంజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్ వంటివి ఉన్నాయి.

Read Also : Free bus for women: ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం ద్వారా వెలవెలబోతున్న మెట్రో