విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షపరుల విరమణ కార్యక్రమం జరగనుంది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు భవానీ దీక్ష విరమణకు దేవస్థానం పాలకవర్గం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఏటా పుణ్యక్షేత్రానికి ఐదు లక్షల మంది భవానీ భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. కెనాల్ రోడ్డు నుంచి ఆలయం వరకు క్యూ లైన్లు, మల్లికార్జున మహా మండపం వద్ద ప్రసాదం కౌంటర్లు తదితర ఏర్పాట్లు చేశారు. ఘాట్‌ల దగ్గర టోన్సర్ సెంటర్లు, స్నానఘట్టాల ఏర్పాట్లు చేస్తున్నారు.భవానీ భక్తులు హోమం నిర్వహించుకునేందుకు హోమగుండాన్ని ఏర్పాటు చేశారు. దీక్ష విరమణ ఏర్పాట్లను ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. ఇటు ఇంద్రకీలాద్రిపై భావనీ దీక్షల విరమణ సందర్భంగా విజయవాడ సిటీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పోలీసులు సూచించిన మార్గాల ద్వారా వాహనదారులు వెళ్లాలని సీపీ తెలిపారు.
Also Read: Fisheries: దేశంలో తీరప్రాంత మత్స్యకార సమస్యలను పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి