కేంద్రం రీసెంట్ గా భారతరత్న (Bharat Ratna) అవార్డు లను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఐదుగురు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించడం విశేషం. ఈ గౌరవాన్ని అందుకుంటున్న వారిలో ఇద్దరు మాజీ ప్రధానులు, ఒక మాజీ ఉప ప్రధాని, ఒక మాజీ ముఖ్యమంత్రితో పాటు ప్రఖ్యాత వ్యవసాయ నిపుణుడు కూడా ఉన్నారు. పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్‌లకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డులను శుక్రవారం నాడు ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join.
కాగా విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు (NTR) కూడా భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ (MP Kanakamedala) లేఖ రాశారు. ప్రధాని మోడీ, అమిత్ షా లకు ఈ మేరకు వేర్వేరుగా లేఖలు రాసిన ఆయన.. సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆద్యుడిగా నిలిచారని గుర్తు చేశారు. సినిమాల నుంచి రాజకీయాల వరకు ఎన్టీఆర్ సత్తా చాటారని , దేశ రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించారని లేఖలో ప్రస్తావించారు. ఈ ఏడాది ఇప్పటికే ఐదుగురికి కేంద్రం భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో ఎన్టీఆర్ పేరును కూడా పరిశీలించాలని టీడీపీ ఎంపీ కోరారు.
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్నను ఏటా విభిన్న రంగాల్లో వ్యక్తులు చేసిన సేవ, పనితీరును గుర్తిస్తూ భారతరత్న ఈ అవార్డును ఏటా ప్రదానం చేస్తూ ఉంటుంది. సాధారణంగా ప్రతీ సంవత్సరం ముగ్గురు వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. కానీ ఈసారి ఏకంగా ఐదుగురికి ఈ గౌరవం దక్కింది. భారతరత్న గ్రహీతలకు ఎలాంటి ద్రవ్య గ్రాంట్ ఉండదు. వారు దేశానికి చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువపత్రం, పతకాన్ని అందజేస్తారు. భారతరత్న గ్రహీతకు కొన్ని ప్రత్యేక అధికారాలు, ప్రయోజనాలు లభిస్తాయి. వారికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తుంది. ఇక భారత ప్రధాన న్యాయమూర్తి జీతానికి సమానమైన మొత్తాన్ని వారికి జీవితకాల పెన్షన్‌గా అందిస్తారు. ఇక భారతరత్న అవార్డు దక్కించుకున్న వారికి అధికారిక ప్రోటోకాల్ లిస్ట్‌లో స్థానం ఉంటుంది.
Read Also : Harish Rao : హరీష్ రావు ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రాజగోపాల్ రెడ్డి