Chandrababu Arrest : చంద్రబాబు కు బండ్ల గణేష్ సపోర్ట్..రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం

చంద్రబాబు జాతీయ సంపద అని, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని , చంద్రబాబు పేరు చెప్పుకుని ఎంతో మంది బాగుపడ్డారని బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేసారు

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 10:40 AM IST

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో(Skill Development Case) అరెస్ట్ అయినా మాజీ సీఎం , టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కు రోజు రోజుకు ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. మొన్నటి వరకు టీడీపీ శ్రేణులు మాత్రమే సపోర్ట్ గా నిలువగా..ఆ తర్వాత ఐటీ ఉద్యోగులు , రాజకీయ పార్టీల నేతలు, ఇతర బిజినెస్ వర్గాల వారు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే సినీ ప్రముఖులు సైతం బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు డైరెక్టర్స్ , నిర్మాతలు సపోర్ట్ చేయగా..తాజాగా బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) సపోర్ట్ చేసారు.

చంద్రబాబు జాతీయ సంపద అని, ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని , చంద్రబాబు పేరు చెప్పుకుని ఎంతో మంది బాగుపడ్డారని బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. బాబు అరెస్ట్ తనను ఎంతగానో బాధించిందని, అయన అరెస్ట్ నేపథ్యంలో తన ఇంట్లో వినాయక చవితి వేడుకలను కూడా జరుపుకోలేదని తెలిపారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని… ఐటీ ఉద్యోగులు నెల రోజుల పాటు ఉద్యోగాలు మానేసి, సొంతూళ్లకు వెళ్లి ధర్నాల్లో పాల్గొనాలని గణేష్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్ లో పార్కుల ముందు, రోడ్లపై కాకుండా… సొంతూళ్లలో బొడ్రాయి ముందు కూర్చోని ధర్నాలు చేయాలని సూచించారు. చంద్రబాబు జైల్లో ఇబ్బంది పడుతుంటే… తనకు ఆహారం కూడా తీసుకోవాలనిపించడం లేదని అన్నారు. అంతే కాదు రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాదించబోతుందని జోస్యం తెలిపారు. ప్రస్తుతం గణేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

Read Also : New Parliament : ఇకపై కొత్త భవనమే భారత పార్లమెంటు.. కేంద్ర సర్కారు గెజిట్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు ను గత శనివారం అరెస్ట్ చేసి , జైల్లో వేసిన సంగతి తెలిసిందే. దాదాపు 10 రోజులు అవుతున్న ఇంకా ఆయనకు బెయిల్ రాలేదు. ఈరోజు ఏపీ హైకోర్టు లో చంద్రబాబు బెయిల్ ఫై విచారణ జరగనుంది. మరోపక్క చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మంగళవారం ఉదయం రాజ్‌ఘాట్‌లోని గాంధీ సమాధి వద్ద లోకేష్, ఎంపీలు, మాజీ ఎంపీలు అంజలి ఘటించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) సైతం పాల్గొన్నారు.