Site icon HashtagU Telugu

Bandaru Satyanarayana : టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్

Bandaru Satyanarayana arrest

Bandaru Satyanarayana arrest

టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తి (Bandaru Satyanarayana) ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు(అక్టోబర్ 3) ఉదయం ఆయన్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. వైసీపీ మంత్రి RK రోజా (RK Roja)ను ఉద్దేశించి బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా దుమారం రేపిన సంగతి తెలిసిందే. మంత్రి హోదాలో ఉన్న మహిళనే ఈ స్థాయిలో దూషిస్తే, సాధారణ మహిళల పరిస్థితి ఏంటంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వెంటనే బండారు సత్యనారాయణ మూర్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మను ట్యాగ్ చేశారు. బండారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను జత చేశారు.

దీనిపై తీవ్రంగా స్పందించిన వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma).. బండారు సత్యనారాయణను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి పోలీసులు పెద్ద ఎత్తున సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడికి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకోవడం తో అక్కడ హడావిడి వాతావరణం చోటుచేసుకుంది. కొద్దీ సేపటి క్రితం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు గుంటూరు పోలీసులు.

We’re now on WhatsApp. Click to Join.

సత్యనారాయణమూర్తి ఫై రెండు కేసులు నమోదు చేసారు పోలీసులు. ఏపీ మంత్రి రోజాపై, ఏపీ సీఎం జగన్ (CM Jagan) పై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విషయమై నోటీసులు ఇచ్చేందుకు ఈరోజు ఉదయం నుంచి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద పోలీసులు ప్రయత్నించారు. అయితే టీడీపీ కార్యకర్తలు పోలీసులను బండారు సత్యనారాయణమూర్తి ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. బండారు ఇంట్లోకి వెళ్లిన పోలీసులు… ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. బండారుకు బీపీ, షుగర్‌ ఎక్కువగా ఉండడంతో… పోలీసులు బండారు ఇంట్లోనే వేచిచూసి, చివరకు అరెస్టు చేసినట్లు ప్రకటించారు. రేపు ఉదయం ఆయన్ను కోర్ట్ లో హాజరు పరచనున్నారు.

కాగా సత్యనారాయణ మూర్తికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఫోన్ చేశారు. ధైర్యంగా ఉండాలని.. పోరాటాన్ని కొనసాగించాలని లోకేష్ చెప్పారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని లోకేష్ హెచ్చరించారు. వైసీపీ తొత్తుల్లా వ్యవహరించే ప్రతి అధికారి వివరాలు నమోదు చేయాలని బండారు సత్యనారాయణమూర్తికి సూచించారు.

Read Also : Udaipur-Jaipur Vande Bharat Express : భిల్వారా సమీపంలో వందే భారత్ ట్రైన్ కు తప్పిన పెను ప్రమాదం